
దర్శకుడు వసంత్ సాయికి అభినందనలు నటుడు, రచయిత , దర్శకుడు వసంత్ సాయి దర్శకత్వం వహించింది 13 చిత్రాలే . అయితేనేం ఆయనకు సృజనాత్మక దర్శకుడుగా మంచి పేరుంది . ఇప్పటికే రెండు సార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి రెండు పర్యాయాలు, భారత ప్రభుత్వం నుంచి రెండు సార్లు ప్రతిష్టాత్మకమైన అవార్డులను స్వీకరించారు . ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన "శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళమ్ " అనే సినిమా 68వ జాతీయ అవార్డుల్లో తమిళ భాషలో ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఎన్నికైంది. అంతేకాదు ఈ సినిమా ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశ్యంతో జపాన్ లోని ఫుకువోకా మ్యూజియం లో భద్రపరిచారు. ఇది తమిళనాడుకె గర్వకారణమని ముఖ్యమంత్రి ఎమ్ .కె .స్టాలిన్ అభినందించి ,ఆయన ద్వారా జపాన్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ ను అందుకున్నారు . వసంత్ సాయి బాలచందర్ శిష్యుడు. ఆయన దగ్గర 18 సినిమాలకు పనిచేశారు . 2005లో "తక్కియిన్ మీదు నాంగు కంగళ్ " అనే షార్ట్ ఫిలింకు దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు . 2016లో " సనత్ "అనే సామాజిక చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతి...