
నేడు రాజబాబు 66వ జయంతి పది మంది కోసం బ్రతికిన మనిషి పోయిన తరువాత ఆ పది మందీ అతని మధుర స్మృతులను పంచుతూ , పెంచుతూ వుంటారు. నటుడు రాజబాబు ఈ కోవకు చెందిన వాడు. రాజబాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని జ్ఞాపకాలను స్నేహితులు మర్చిపోలేదు. రాజబాబు జయంతి రోజును వేడుకగా నిర్వహిస్తూ, అతను వచ్చిన నాటక రంగం , టీవీ మాధ్యమం , సినిమా రంగంలోని ప్రతిభావంతులను సత్కరిస్తున్నారు . ఇది కేవలం రాజబాబును స్మరించుకోవడం మాత్రమే కాదు , సహా నటీ నటులకు ఆర్ధికంగా చేయూతనివ్వడం కూడా . రాజబాబు అంటే అటు కుటుంబ సభ్యులకే కాదు ఆయనతో అనుబంధం వున్న కాకాని బ్రహ్మం నర్రా వెంకట రావు, వేములపల్లి కుమార్, రావిపాటి నాగేశ్వర రావు, బాలాజీ, నా లాంటి మిత్రులందరికీ మంచి స్నేహశీలి. మానవతావాది. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు పెద్దలు. ఈ సూత్రాన్ని రాజబాబు బాగా వంటపట్టించుకున్నాడు. ఎంత పేరు సంపాదించినా బంధువులు, స్నేహితులతో చాలా ఆత్మీయంగా మెలిగేవాడు. అందరిలో ఒకడిగా కలసిపోయేవాడు. ఆయనలో అహం , అహంకారం ఎప్పుడూ రాలేదు . అదే రాజబాబు ప్రత్యేకత. రాజబాబు , తూర్పు గోదావర...