ఆత్మీయ మిత్రుడు , నటుడు రాజబాబు ఇకలేరు మా అందరికీ అత్యంత ఆప్త మిత్రుడు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64 సంవత్సరాలు . రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో మాత్రం చాలా సరదామనిషి .తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది. రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు . ఆయన తండ్రి పేరు రామతారకం . ఆయన చిత్ర నిర్మాత నటుడు కూడా . . దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “, “రాధమ్మ పెళ్లి ” సినిమాలను నిర్మించారు. కాకినాడలో స్థిరపడిన రాజబాబు కు వ్యవసాయం చెయ్యడమన్నా , కబడే ఆడటమన్నా , రంగస్థల మీద నటించడమన్నా ఎంతో ఇష్టం .చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు . దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును. 1995లో “ఊరికి మొనగాడు ” అ...
Posts
Showing posts from October, 2021
- Get link
- X
- Other Apps
కలకత్తా విక్టోరియా దగ్గర గుర్రపు బగ్గీలు ఒకప్పుడు హైద్రాబాద్లో గుర్రపు బగ్గీలు ఉండేవి . క్రమంగా అవి కనుమరుగయ్యాయి . ఎప్పుడైనా పెళ్లిలో మాత్రం ఇప్పటికీ గుర్రపు బగ్గీలపై వధూవరులను ఊరేగిస్తుంటారు . అయితే కలకత్తాలో మాత్రం ఇప్పటికీ ట్రామ్ లు , మనుషులు నడిపే రిక్షాలు , గుర్రపు బగ్గీలు వున్నాయి . బ్రిటిష్ వారి కాలంలో మొదట కలకత్తా దేశ రాజధానిగా ఉండేది . ఆ సమయంలో బ్రిటిష్ వారు అనేక అపురూపమైన భవనాలను నిర్మించారు .ఇప్పటికీ ఆ భవనాలు చెక్కుచెదరకుండా వున్నాయి. అయితే కలకత్తా మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే వెనుకపడే ఉందని చెప్పాలి . ఇప్పటికీ కలకత్తాలో హెరిటేజ్ భవనాల సంరక్షణ తో పాటు సంప్రదాయ ప్రజా రవాణాను కొనసాగిస్తూ ఉండటం విశేషం . ట్రామ్ లను ప్రజా రవాణా నుంచి తొలగించినా చౌరంగీ లేన్ లో మాత్రం ఇప్పటికీ తిరుగుతూ ప్రజలకు గత కాలాన్ని గుర్తు చేస్తుంటాయి . మనుషులు నడిపే రిక్షాలు ఇంకా అక్కడక్కడా కనిపిస్తుంటాయి . గుర్రపు బగ్గీలు మాత్రం జవహర్ లాల్ నెహ్రు మార్గంలోని విక్టోరియా మెమోరియల్ దగ్గర ఎక్కువుగా ...