కలకత్తా విక్టోరియా దగ్గర గుర్రపు బగ్గీలు 



ఒకప్పుడు హైద్రాబాద్లో గుర్రపు బగ్గీలు ఉండేవి . క్రమంగా అవి కనుమరుగయ్యాయి .  ఎప్పుడైనా   పెళ్లిలో మాత్రం ఇప్పటికీ  గుర్రపు బగ్గీలపై వధూవరులను ఊరేగిస్తుంటారు . అయితే కలకత్తాలో మాత్రం ఇప్పటికీ ట్రామ్ లు , మనుషులు నడిపే రిక్షాలు , గుర్రపు బగ్గీలు వున్నాయి . 

బ్రిటిష్ వారి కాలంలో మొదట కలకత్తా దేశ రాజధానిగా ఉండేది . ఆ సమయంలో బ్రిటిష్ వారు అనేక అపురూపమైన భవనాలను నిర్మించారు .ఇప్పటికీ ఆ భవనాలు చెక్కుచెదరకుండా వున్నాయి. అయితే కలకత్తా మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే  వెనుకపడే ఉందని చెప్పాలి . ఇప్పటికీ కలకత్తాలో హెరిటేజ్ భవనాల సంరక్షణ తో పాటు సంప్రదాయ ప్రజా రవాణాను కొనసాగిస్తూ ఉండటం విశేషం . ట్రామ్ లను ప్రజా రవాణా నుంచి తొలగించినా చౌరంగీ లేన్ లో మాత్రం ఇప్పటికీ తిరుగుతూ ప్రజలకు గత కాలాన్ని గుర్తు చేస్తుంటాయి . మనుషులు నడిపే రిక్షాలు ఇంకా అక్కడక్కడా కనిపిస్తుంటాయి .



గుర్రపు బగ్గీలు మాత్రం జవహర్ లాల్ నెహ్రు మార్గంలోని విక్టోరియా మెమోరియల్ దగ్గర ఎక్కువుగా కనిపిస్తుంటాయి . కలకత్తా వచ్చినవారు తప్పకుండా విక్టోరియా మెమోరియల్ చూడకుండా వెళ్ళరు . బ్రిటిష్ రాణి విక్టోరియా 1901వ సంవత్సరంలో చనిపోయారు . ఆమె స్మృతి చిహ్నంగా అప్పటి బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ రాణి కోసం ఓ మ్యూజియం నిర్మించాలని సంకల్పించారు . ఒక భవనం , దాని చుట్టూ ఉద్యానవనం ఏర్పాటు చేయాలనుకున్నారు .1906 జనవరి 4వ తేదీన అప్పటి బ్రిటిష్ రాకుమారుడు వాలేష్ శంకుస్థాపన చేశారు  1921లో ఈ మ్యూజియం ప్రారంభమైంది . 100 సంవత్సరాలక్రితం మొదలైన ఈ మ్యూజియం లో 30,000 వేల  అపురూపమైన కళాఖండాలున్నాయి . 

ప్రతి రోజు వేలాది మంది ఈ మ్యూజియం చూడటానికి వస్తుంటారు . వారి కోసం మ్యూజియం వెలుపల ఒకప్పటి గుర్రపు బగ్గీలు ఆకర్షణగా కనిపిస్తాయి . పిల్లలే కాదు పెద్దవారు కూడా వీటి మీద ప్రయాణించాలని కోరుకుంటారు . మీరు ఎప్పుడైనా కలకత్తా వెడితే విక్టోరియా మ్యూజియం చుసిన తరువాత గుర్రపు బగ్గీ ఎక్కడం మర్చిపోకండి . 


Comments

Popular posts from this blog