మసాలా మూవీ "స్ట్రీట్ లైట్ ట్రైలర్ " 


             మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్,  కావ్య రెడ్డి,  వినోద్ కుమార్ ప్రధాన                 పాత్రల్లో  విశ్వ దర్శకత్వంలో   శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్.  ఈ                 చిత్రం     టీజర్  ను    దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి  విడుదల చేయగా, ట్రైలర్ ని నిర్మాత                 సి కళ్యాణ్ విడుదల చేశారు .

సి కళ్యాణ్ మాట్లాడుతూ .. పాట .. చాలా బాగుంది.. రామసత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు.. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్  రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అని చెప్పాలి. అయన ఆలోచనలు ఆ రేంజ్ లో ఉన్నాయి. నిర్మాత శ్రీనివాస్ ఛాంబర్ మనిషిగా, ఎగ్జిబిటర్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఐతే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది.. కానీ అది శృతి మించకూడదు అని నా సలహా. ఈ సినిమా చూస్తుంటే చాలా ఫైర్ తో తీసినట్టు అనిపిస్తుంది అన్నారు. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ .. ఈ సినిమాను చూస్తే చిన్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా అనిపిస్తుంది. ప్రభాస్ బాహుబలి తరహాలో ఇదికూడా చిన్న బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది అన్నారు. 

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాత శ్రీనివాస్ అటూ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పాపులర్ అయిన వ్యక్తి. ఆయనకు ఎలా సినిమా తీయాలో బాగా తెలుసు. అప్పట్లో యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వారితో పోరాటం చేసిన వ్యక్తి. అయన తీసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాలి.అన్నారు.  

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ బాబు, అల్లు  అరవింద్, రమేష్ ప్రసాద్ లాంటి వారు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసిన తరువాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మామిడాల శ్రీనివాస్ కూడా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసి వారికంటే తక్కువ రేట్స్ కు సినిమా వేస్తామని చెబితే మొదట్లో చాలా సమస్యలు వచ్చాయి. అయినా వారితో పోరాటం చేసి చివరకు వారందరు కలిసి ఆయనను కలుపుకుపోయారు. అలాంటి గట్స్ ఉన్న నిర్మాత. అయన నిర్మిస్తున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి.  అన్నారు. 

దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. శ్రీనివాస్ గారు డిస్ట్రిబ్యూటర్ గా నాకు బాగా తెలుసు.ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువైంది అని అనిపిస్తుంది. 

చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ ..ఇది కచ్చితంగా మెసేజ్ ఇచ్చే సినిమా. ఇందులో కంటెంట్ అలాంటిది కాబట్టి అలా చూపించాం. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీసాం .. చీకట్లో   స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం.అన్నారు. 

నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ .. సి కళ్యాణ్ గారికి, దాము గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, ప్రసన్న గారికి, రామసత్యనారాయణ గారికి, ధన్యవాదాలు తెలుపుతున్నాం.. కరోనా అయిపోయాకా సెప్టెంబర్ లో సినిమా మొదలెట్టి డిసెంబర్ వరకు పూర్తీ చేసాం.. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. ఆయనకు కాలు నొప్పి ఉన్నా కూడా నిర్మాత షెడ్యూల్ విషయంలో నష్టపోవద్దు అంటూ రిస్క్ చేసి మరి షూటింగ్ చేసారు. 

హీరోయిన్ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ .. మా నిర్మాత కు హ్యాపీ బర్త్ డే.. అలాగే దర్శకుడు విశ్వా గారికి థాంక్స్ చెప్పాలి. ఈ పాత్రకు నన్ను ఎంపికచేసినందుకు.  అన్నారు. 



Comments

Popular posts from this blog