
శుభకృత్ ఉగాది పురస్కారం . ఈ సంవత్సరం నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక , ప్రణతి క్రియేషన్స్ సంయుక్తంగా ఉగాది సినిమా పురస్కారాలను ప్రకటించాయి . ఇందులో జర్నలిస్ట్ విభాగంలో నాకు అవార్డును ప్రకటించారు . ఈ సందర్భంగా మిత్రులు మోహన్ గౌడ్, విజయ వర్మ ,శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభకృత్ నామ ఉగాది సినీ పురస్కారాల కార్యక్రమం ఏప్రిల్ 2వ తేదీ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతుందని నిర్వాహక కమిటీ సభ్యులు జె వి మోహన్ గౌడ్ , విజయ్ వర్మ పాకలపాటి , కూనిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు .ఉగాది పండుగ రోజున తెలుగు సినిమా రంగానికి చెందిన ఈ క్రిందివారికి అవార్డును అందించి సత్కరిస్తామని వీరు తెలిపారు . నిర్మాతల విభాగం .. 1. శ్రీమతి ఎన్. ఆర్. అనురాధాదేవి 2. శ్రీ జాగర్లమూడి రాధాకృష్ణ 3. శ్రీ జి. సత్యనారాయణ రాజు ( సత్తిరాజు ) ఎగ్జిబిటర్స్ విభాగం ... 1. శ్రీ రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ ... నవరంగ్ థియేటర్ .. ఆంధ్రప్రదేశ్ 2. శ్రీ ఎం. విజేందర్ రెడ్డి .. వేంకటేశ్వర థియేటర్ .. తెలంగాణ డిస్ట...