ఈరోజు నటి కృష్ణకుమారి గారి 89వ జయంతి
కృష్ణ కుమారి తెలుగు, తమిళ ,కన్నడ చిత్ర రంగాల్లో హీరోయిన్ గా నటించింది 1951 లో "నవ్వితే నవరత్నాలు " సినిమాతో ప్రారంభమైన ఆమె సినిమా జీవితం 2003లో "ఫూల్స్" సినిమా వరకు కొనసాగింది. కృష్ణకుమారి గారు 110 సినిమాల్లో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రల్లో నటించింది .
కృష్ణ కుమారి గారు 2003 వ సంవత్సరంలో దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించిన "ఫూల్స్ " సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. హైద్రాబాద్లోని నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో "ఫూల్స్ " చిత్రం షూటింగ్ లో కృష్ణ కుమారి గారిని దాసరి నారాయణ రావు గారు పరిచయం చేశారు . నేను అప్పుడు ఆంధ్ర ప్రభ లో పనిచేస్తున్నాను . అప్పుడు కృష్ణకుమారి గారిని ఇంటర్వ్యూ చేశాను .
Comments
Post a Comment