Posts

Showing posts from June, 2024
Image
 ఈనాడు రామోజీ రావు గారు అస్తమయం  తెలుగు పత్రికా రంగంలో చెరగని ముద్రవేసిన పద్మవిభూషణ్ రామోజీ రావు గారు ఇక లేరు అన్న విషాద వార్త నన్ను కలవరపరిచింది .  పత్రికా రంగం , సినిమా రంగం , వ్యాపార రంగాల్లో ఆయన సాధించిన ప్రగతి అపూర్వం , అనితర సాధ్యం .  రామోజీ రావు గారితో నాకు 1983 నుంచి పరిచయం .  ఎన్ .టి .రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారి రామోజీ రావు గారిని జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక (ఆంధ్ర జ్యోతి సంస్థ ) రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేశాను. ఈనాడు కార్యాలయంలో రెండవ ఫ్లోర్ లో ఉండేవారు .  అప్పుడు  వారు నా పట్ల చూపించిన అభిమానం,  ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేను. రామోజీరావు గారితో నేను చేసిన ఆ  ఇంటర్వ్యూ సంచలనం  సృష్టించింది . ఆ తరువాత అనేక సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. నా పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించేవారు .  1987 ఫిబ్రవరి 8న నా వివాహ రిసెప్షన్ కు వారిని ఆహ్వానించాను. నేను  ఆంధ్ర జ్యోతి లో పనిచేసేవాడిని . ఈనాడులో పనిచేయలేదు కాబట్టి వారు హాజరు కారు అనుకున్నాను. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన రిసెప్షన్ కు రామోజీ రావు గారు మయూరి జనరల్ మేనేజర్ త్రిపురనేని కేశవ రావు గారు , ఉషాకిరణ్ మూవీస