Posts

Showing posts from September, 2025
Image
 అక్కినేని నాగేశ్వర రావు గారి 101వ జయంతి .   ఈరోజు మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారి 101వ జయంతి . తెలుగు సినిమా రంగంలో అద్వితీయ ,అసమాన నటులు అక్కినేని నాగేశ్వర రావు , ఎన్ .తో. రామారావు. ఈ ఇద్దరితో  జర్నలిస్టుగా నాకు పరిచయం  ఉంది .ఇద్దరూ నను అభిమానించినవారే . ఈ ఇద్దరూ తెలుగు వారికి ప్రాతః స్మరణీయులే .  నాగేశ్వర రావు గారితో పరిచయం అయితే .. ఆ వ్యక్తి నచ్చితే ... అక్కినేని ఎంతో ఆత్మీయతను పంచుతారు.  నాగేశ్వర రావు రావు గారితో ఎన్నో మధురమైన సంఘటనలు ఉన్నాయి .  1987 ఫిబ్రవరి 8న ప్రెస్ క్లబ్ లో జరిగిన మా మ్యారేజ్ రిసెప్షన్ కు నాగేశ్వర రావు గారు నిర్మాత రామానాయుడు గారు, రామోజీ  రావు గారు , దుక్కిపాటి మధుసూదన రావు గారు ,నండూరి రామ మోహన్ రావు గారు  వచ్చి ఆశీర్వదించారు .  అదొక తీపి జ్ఞాపకం .  1992లో నాగేశ్వర రావు గారిని నంగునూరి చంద్రశేఖర్ గారి సోదరుడు అమర్నాథ్,  వాళ్ళ అబ్బాయి బారసాలకు ఆహ్వానించారు. ఆ కార్యక్రమం బేగంపేట్ లోని వారి ఇంటిలో ఏర్పాటుచేశారు . చంద్రశేఖర్ నన్ను కూడా ఫ్యామిలీతో  ఆహ్వానించారు .  ఆ కార్యక్రమం జరుగుతూ ఉండ...