డా . నరిశెట్టి ఇన్నయ్య , డా .నవీన నరిశెట్టి హేమంత్
అందరూ చదవాల్చిన అపురూప గ్రంథం " కరోనా వైరస్ "
కోవిద్ -19 . ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వైరస్ .
దీని పూర్వాపరాలు - విశ్లేషణ - మార్గదర్శకాలు గురించి ఇంగ్లిష్ లో డా. స్వప్ నైల్ పారిఖ్ , డా . మహేరా దేశాయ్ , డా . రాజేష్ పారిఖ్
రచించారు . వీరు ఈ గ్రంథాన్ని ఎన్నో గ్రంథాలు , వ్యాసాలు పరిశీలించి ,పరిశోధించి రచించారు . ఈ గ్రంథాన్ని తెలుగులో డా . నరిశెట్టి ఇన్నయ్య , డా .నవీన నరిశెట్టి హేమంత్ అనువదించారు .
వైరస్ గురించి వెలువడిన అద్భుతమైన పుస్తకం . అందరూ చదవాల్చిన గ్రంథం .
సీనియర్ జర్నలిస్ట్ ఇన్నయ్య గారు గతంలో ఎన్నో గ్రంధాలను రచించారు . కరోనా వైరస్ గురించి తెలుగువారి కోసం ఇన్నయ్య గారు డాక్టర్ అయిన తమ కుమార్తె నవీన తో కలసి అందించారు . ఈ గ్రంధంలో ఎంతో విలువైన సమాచారం వుంది .
దీనిని ఎమెస్కో వారు ప్రచురించారు . జూబిలీహిల్స్ జర్నలిస్ట్ ఏ కాలనీలోని అక్షర బుక్ షాప్ లో ఇది లభ్యమవుతుంది .
ఇంతమంచి పుస్తకాన్ని తెలుగులో తీసుకొచ్చిన డా . ఇన్నయ్య గారిని, డా . నవీన గారిని అభినందించాలి .
Comments
Post a Comment