ఈరోజు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .
శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక లాంటి అద్భుత దృశ్య కావ్యాలను మనకు అందించిన నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87వ జయంతి. 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి విజయం సాధించారు . ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కె . విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందించిన శంకరాభరణం తెలుగు సినిమా ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకెళ్లింది . ఈ చిత్రానికి వచ్చిన పేరు కలెక్షన్స్ గాని , జాతీయ - అంతర్జాతీయ - అవార్డులు మరే చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేశం వెళ్లినా శంకరాభరణం గురించి మాట్లాడేవారు .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ప్రేరణ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కె .విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం , మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది . కె .విశ్వనాధ్ కమలహాసన్ రాధిక ల కలయిక లో వచ్చిన .స్వాతి ముత్యమ్ ఓ క్లాసిక్. జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ చిత్రం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నికైన మొట్ట మొదటి తెలుగు చిత్రం . స్వయంకృషి - మెగాస్టార్ చిరంజీవి తో నిర్మించిన స్వయంకృషి .తెలుగు సినిమాకు అంతర్ జాతీయ గౌరవాన్ని తీసుకొచ్చిన ఏడిద నాగేశ్వర రావు ఆదర్శ ప్రాయుడు
Comments
Post a Comment