
ఈరోజు దాశరధి గారి జయంతి ఈరోజు మహాకవి దాశరధి గారి 96వ జయంతి . తెలుగు సాహిత్యంలో , సినిమా పాటల్లో దాశరధి గారిది ఓ ప్రత్యేకమైన శైలి . ఆయన జీవితమంతా విలువల కోసం బ్రతికారు . పదవులు వస్తే స్వీకరించారు తప్ప వాటి కోసం తన ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ వదులుకొని మంచి మనిషి. నిరాడంబరుడు , నిగర్వి ఈనాటి కవులందరికీ స్ఫూర్తి ప్రదాత దాశరధి గారు . 1987లో జరిగిన నా వివాహానికి దాశరధి గారు వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు . దాశరధి గారితో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు వున్నాయి . మహాకవి దాశరధి ప్రాతః కాల స్మరణీయులు .