ఈరోజు రాజేంద్ర ప్రసాద్ 65వ జన్మదినం
హాస్య చిత్రాల కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ 65వ జన్మ దినం . ఆరోగ్యకరమైన హాస్యానికే చిరునామా, విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషించే రాజేంద్ర ప్రసాద్ నాకు మంచి మిత్రుడు కృష్ణాజిల్లా నిమ్మకూరులో జులై 19, 1956లో జన్మించిన ప్రసాద్ మహానటుడు ఎన్ .టి .రామారావు గారి ఆశీస్సులతో 1977లో బాపు దర్శకత్వం వహించిన "స్నేహం " సినిమాతో నటుడయ్యారు . 44 సంవత్సరాల తరువాత కూడా రాజేంద్ర ప్రసాద్ విలక్షణమైన పాత్రలను పోషిస్తున్నారు . ప్రసాద్ ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ---
జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా !
Comments
Post a Comment