"సినిమా పోస్టర్ " ఈశ్వర్ ప్రస్థానం
 

"సినిమా పోస్టర్ " ఈశ్వర్ ప్రస్థానం 
సీనియర్ సినిమా పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు . ఆయన వయసు 84 సంవత్సరాలు . 
తెలుగు సినిమా రంగంలో ఈశ్వర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి , ఆయన వందల సినిమాలకు పోస్టర్ డిజైన్ లను తయారు చేశారు . అలాగే నటి నటుల పెయింటింగ్ లను కూడా అద్భుతంగా గీశారు . ఆయన పూర్వీకులు శిల్ప కళలో నిపుణులు కావడంతో వంశపారంపర్యంగా ఈశ్వర్ కు కూడా ఆ కళ వచ్చింది . చిన్నపుడు , నాటకాలు రాసి రంగస్తలంపై ప్రదర్శించేవారు . ఆ నాటకాలకు తానే బొమ్మలు గీసేవాడు . 
పాలిటెక్నీక్ చదువుతూ ఉండగా  తల్లి మరనించింది . దాంతో  చదువు ఆగిపోయింది . అప్పుడు ఎదో ఒక పనిచేసుకుందామని మద్రాస్ వచ్చారు . తనకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం , ఆ వృత్తిలోనే కొనసాగాలని సినిమా రంగంలో వున్న ఆర్టిస్టు కేతా దగ్గర శిష్యుడుగా చేరిపోయాడు . 1961 నుంచి 66 వరకు పబ్లిసిటీ లో అనుభవం సంపాదించాడు . 1967వ సంవత్సరంలో కేతా నుంచి బయటకు వచ్చి స్వంతంగా సినిమాలకు పనిచెయ్యడం మొదలు పెట్టాడు . 
తెలుగులో బాపు గారు దర్శకత్వం వహించిన "సాక్షి " సినిమాకు  ఈశ్వర్ డిజైన్ లు తయారు చేశారు . అవి బాపు గారి కి ఎంతో నచ్చాయి . ఈశ్వర్ గారి గురించి విని విజయా స్టూడియోస్ నాగిరెడ్డి , చక్రపాణి గారు తమ సినిమాలకు పనిచెయ్యమని ఆహ్వానించారు . ఆ తరువాత 
ఈశ్వర్ అవిశ్రాంతంగా పనిచేశారు . 
ఈశ్వర్ తన సినిమా జీవితంలో కొన్ని వందల సినిమాలకు పనిచేశారు . అయితే అందులో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు "పాపకోసం ", " ప్రేమ్ నగర్ " చిత్రాలని చెబుతాడు . అలాగే తెలుగు తమిళ రంగాల్లో నటీనటుల పెయింటింగులు గీయడంలో ఈశ్వర్ సిద్ధహస్తుడు . 
1970 వ సంవత్సరంలో తమిళనాడుకు కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈశ్వర్ ఇంటికి వచ్చి అన్నాదురై 9 అడుగుల చిత్రం కావాలని అడిగారు . అందుకు ఒక నెల రోజులు సమయం కూడా ఇచ్చారు . అనుకున్న సమయానికి ఈశ్వర్ అన్నాదురై అద్భుతమైన పెయింటింగ్ తయారు చేసి ఇచ్చారు.  ఆ పెయింటింగ్ ను రాజాజీ హాలు లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిష్కరించారు . ఆ సందర్భంగా ఇందిరాగాంధీ సంతకం చేసిన ఒక ఒక సరిఫికేటును ఈశ్వర్ కు బహుకరించారు . 
ఈశ్వర్ తెలుగు సినిమా రంగంలో 52 మంది పబ్లిసిటీ ఆర్టిస్టులను తయారు చేశారు . వారంతా గురువు ఈశ్వర్ మంచితనాన్ని మెచ్చుకుంటారు .  
ఈశ్వర్ ఒక సినిమాకు దర్శకత్వం వహించారు . ఆ సినిమా రెండు వారాలు మాత్రమే ఆడింది . అయితే ఆ సినిమా ఈశ్వర్ చేసు అనుభవాన్నే మిగిల్చింది . 
2011లో తన అనుభవాలు , తాను తయారు చేసిన డిజైన్ లు, పెయింటింగులతో " సినిమా పోస్టర్ " అనే పుస్తకం ప్రచురించారు . 
తెలుగు సినిమా వెలుగుల ప్రస్థానం "సినిమా పోస్టర్ 'లో మనకు కనిపిస్తుంది . 
-భగీరథ 

Comments

Popular posts from this blog