నాగండ్ల గ్రామంపై రావిపూడి వెంకటాద్రి  ప్రభావం : భగీరథ 


హేతువాది, మానవవాది రావిపూడి వెంకటాద్రి గారి ప్రభావం నాగండ్ల గ్రామంపై ఉందని , 1956 నుంచి 1996 వరకు వెంకటాద్రి గారు 40 సంవత్సరాలపాటు  గ్రామ అధ్యక్షుడుగా పనిచేశారని జర్నలిస్ట్ , కవి, రచయిత భగీరథ తెలిపారు . 
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలతో ప్రభావితమైన వెంకటాద్రి 1943 ఏప్రిల్ 5న నాగండ్ల గ్రామంలో మిత్రులతో కలసి కవిరాజాశ్రమం ప్రారంభించారు. ఏప్రిల్ 5, 2022 కు కవిరాజాశ్రమం స్థాపించి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా గ్రామంలో రావిపూడి వెంకటాద్రి గారిని  హేతువాదులు, ప్రజలు  ఘనంగా సత్కరించారు . ఫిబ్రవరి 9న  వేంకటాద్రి గారి 101వ జన్మదిన వేడుకలు రాడికల్ హ్యూమానిస్తూ సెంటర్ , ఇంకొల్లులో మిత్రులు  ఘనంగా నిర్వహించారు . 
ఈ సందర్భగా  నాగండ్ల గ్రామంలో జన్మించి హైద్రాబాద్ లో ఉంటున్న జర్నలిస్ట్ , కవి, రచయిత భగీరథ మాట్లాడుతూ ,  మా నాగండ్ల గ్రామంపై వెంకటాద్రి గారి ప్రభావం ఎంత ఉందొ ప్రత్యక్షముగా చూశాను . వెంకటాద్రి గారు పెరియార్ రామస్వామి , త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు చదివి ఆ ప్రభావంతో హేతువాదిగా మారిపోయారు. తరువాత 1946లో "విశ్వాన్వేషణ" , 1949లో "జీవమంటే ఏమిటి?", 1951లో "శాస్త్రం శాత్రం - పురాణం" , 1953లో "మానవుడు - సమాజం -ప్రకృతి", 1955లో "మార్క్సిస్ట్ భౌతికవాదం"  అనే రచనలు చేసి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. చిన్న వయసులోనే సమాజం  గురించి సరికొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు ఆ హేతుతత్వ దిశగా గ్రామ  ప్రజలను కూడా నడిపించారు . పల్లెటూరి ప్రజల్లో తరతరాలుగా వున్న మూఢ విశ్వాస్వాలను, నమ్మకాలను పోగొట్టి చైతన్య పరిచారు. పిల్లల కోసం గ్రామంలో పాఠశాలను ప్రారంభించి,   ఆధునిక దృక్పధంతో పాఠాలు చెప్పారు. 1956వ సంవత్సరంలో గ్రామ సర్పంచి గా ఎన్నికయ్యారు. గ్రామంలోని యువతీ యువకుల కోసం జిల్లా గ్రంథాలయ శాఖను నాగండ్లలో ఏర్పాటు చేశారని చెప్పారు . 

  
తా ను 7వ తరగతి చదివే రోజుల్లోనే నాగండ్ల గ్రామంలో  గ్రంథాలయం ప్రారంభమైందని. అక్కడే టాగోర్ , శరత్ బాబు, బంకిం చంద్ర , త్రిపురనేని గోపీచంద్ , శ్రీ శ్రీ , చలం, ముప్పాళ రంగనాయకమ్మ , కొడవగంటి కుటుంబరావు, రావిశాస్త్రి ,దేవరకొండ బాలగంగాధర్ తిలక్ మొదలైన వారి రచనలు చదవడం మొదలు పెట్టానని .  పావులూరు గ్రామంలో  చదువుకునేటప్పడు అక్కడ గ్రంథాలయంలో   వున్న పుస్తకాలు చదివానని , ఆ ప్రభావంతో కంద పద్యాలూ , కథలు వ్రాయడం మొదలు పెట్టినట్టు తెలిపారు . 
వెంకటాద్రి గారు ఊరి ప్రజలందరినీ సమ దృష్టితో చూసేవారని  . నాగండ్ల గ్రామంలో అసృశ్యత అనేది తా ను ఎప్పుడూ చూడలేదని  . అందుకే ఆయన నాలుగు దశాబ్దాలపాటు సర్పంచ్ గా కొనసాగారని భగీరథ వివరించారు . 
నాగండ్ల  గ్రామం అంటే చుట్టుప్రక్కల ప్రజలందరికీ గౌరవం , కారణం  నాగండ్ల గ్రామంలో పుట్టిన వారందరూ చాల తెలివికవారని వారి నమ్మకం . అది నిజమేనని , పావులూరు హై స్కూల్ లో చదివేటప్పుడు 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు , వ్యాసరచన , వక్తృత్వ పోటీల్లో అన్ని బహుమతులు తనకే  వచ్చేవాణి చెప్పారు. నాగండ్ల గ్రామానికి ఎంతో చారిత్రిక నేపథ్యం వుంది . 1242వ సంవత్సరంలో కాకతీయ కుమార రుద్రదేవుని పాలనలో ఈ గ్రామం ఏర్పడింది . చుట్టూ ప్రక్కల  గ్రామ ప్రజలు ఈ పాడి గడ్డ మీద నాగళ్లను విడిచి పెట్టేవారట . అలా కొన్నాళ్ళు జరిగిన  తరువాత అక్కడ గ్రామాన్ని నిర్మించాలనే సంకల్పానికి వచ్చారట . అలా ఏర్పడిన గ్రామానికి  నాగండ్ల అనే పేరు పెట్టారని భగీరథ చెప్పారు . 


1976లో వెంకటాద్రి గారు చీరాల వెళ్లిపోయారు . అక్కడ ఆయన తన పూర్తి సమయాన్ని హేతువాదం పై పెట్టారు . హేతువాద మిత్రుల సహకారంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో తన భావ జాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలు పెట్టారు . ఆంధ్ర ప్రదేశ్ హేతువాద సంఘ అధ్యక్షులుగా , భారత హేతువాద సంఘ అధ్యక్షులుగా ఆయన  సేవలందించారు . ఇప్పటికి 100 పుస్తకాలు రచించారు . ఆయన తన జీవితాన్ని హేతువాద , మానవవాద ఉద్యమానికే అంకిత చేశారని చెప్పారు. 
వెంకటాద్రి గారు నాగండ్ల గ్రామ ప్రజల్లో చైతన్యము తీసుకురావడంతో పాటు ప్రశ్నించడం నేర్పారు . ప్రతిదీ హేతుబద్దంగా ఆలోచాలనేవారు . ఆయన ప్రభావం తన మీద మీద కూడా ఎక్కువగా ఉందని , నాగండ్ల గ్రామం ను నుంచి తాను 1971లో ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వెళ్లానని , అదే సంవత్సరం పత్రికల్లో తన రచనలు ప్రచురితం కావడం మొదలయ్యాయని , 1974లో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి తానూ రచించిన "ఆహుతి " అన్న నాటం ఒక గంటసేపు ప్రసారమైంది భగీరథ చెప్పారు .తానూ ఇప్పటి వరకు 15 పుస్తకాలు రచించానని , నంది అవార్డుల కమిటీ , ఇతర ప్రైవేట్ సంస్థల కమిటీలు , దూరదర్శన్ కమిటీ , తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథాల ఎంపిక కమిటీ , డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్  సార్వత్రిక విశ్వవిద్యాల సూచనల కమిటీ, ప్రతియా సెన్సార్ కమిటీ , జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ లోనూ సభ్యుడిగా పనిచేశానంటే అందుకు పునాది నాగండ్ల గ్రామమేనని , ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వము తో పాటు ప్రైవేట్  సంస్థల నుంచి 21 అవార్డులు స్వీకరించాలని భగీరథ తెలిపారు . 
2007 నుంచి తాను దక్షిణ భారత దేశంపై ముఖ్యముగా కాకతీయ , విజయనగర  సామ్రాజ్యాలపై పరిశోధన చేస్తున్నాని , 2014లో వంగూరి చిట్టెన్ రాజు గారి ఆహ్వానంపై అమెరికా సందర్శించానని , అక్కడ దక్షిణ భారత దేశ చరిత్రపై మాట్లాడానని , తన ప్రసంగం యువతరాన్ని బాగా ఆకట్టుకుందని చెప్పారు . 
తాను  ఎంత ఎదిగినా , ఎన్ని అవార్డులు సంపాదించినా , కీర్తి  వచ్చినా అందుకు వెంకటాద్రి గారి స్ఫూర్తి , ప్రభావం తనపై ఎక్కువగా ఉందని భగీరథ చెప్పారు. 
వెనకటాద్రి పై అమిత ప్రభావం చూపించిన త్రిపురనేని రామస్వామి  సర్వలభ్య రచనల సంకలనాన్ని నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్  రావెల సాంబశివరావు ఆవిష్కరించి సమీక్షించారు . ఈ గ్రంధాన్ని మనసు ఫౌండేషన్ ప్రచురించింది . పారా అశోక్ కుమార్ సంకలనం చేశారు . తరువాత కవిరాజాశ్రమం - నాగండ్ల  అన్న గ్రంధాన్ని కవిరాజ సాహితీ సమితి , గుంటూరు  సభ్యుడు ఆలోకం పెద్ద సుబ్బయ్య ఆవిష్కరించారు . దీనిని మేడూరి సత్యనారాయణ సంకలనం చేశారు . 


100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రావిపూడి వెంకటాద్రి గారిని  కుర్రా హనుమంత రావు , మేడూరి సత్యనారాయణ , భగీరథ, వీరగంధం ఆంజనేయులు ,డాక్టర్ సి హెచ్  కోటేశ్వర రావు ,  జొన్నలగడ్డ  రామారావు , అడియాల శంకర్, షేక్ బాబు, కరి హరి బాబు , చుంచు శేషయ్య , పారా అశోక కుమార్ , వేంకటాద్రి కుమార్తెలు శుభాదేవి , శోభాదేవి , కుమారుడు జయంత్ , మనుమరాలు భారతి , మనుమడు ప్రసన్న ,గ్రామ ప్రజలు సోమేపల్లి రామ్మోహన రావు ,చెరుకూరి రమేష్ , ఈదర వెంకటేశ్వర్లు , గాలి అంజయ్య , చెరుకూరి బ్రహ్మయ్య, ఈదర వీర నారాయణ , కర్రీ సుబ్బారావు , గోరంట్ల వీరయ్య , బాచిన హనుమత రావు , కర్రీ బంగారు , లక్ష్మణ రావు , సోమేపల్లి విశ్వనాథం , కోయి శ్రీనివాసరావు , వీరయ్య , రాయపూడి సిద్దయ్య , బ్రహ్మయ్య , పేర్ని సూర్యనారాయణ , రావిపూడి హనుమోజి రావు , ఈదర సుబ్బారావు , రామారావు ,ఆంజనేయులు ,గుమ్మడిల్లి రవి , శేషమ్మ , రాజ్యమ్మ తదితరులు ఘనంగా సత్కరించారు . 
ఈ కార్యక్రమాన్ని నాగండ్ల గ్రామంలో, ఇంకొల్లు జెడ్ పి టి .సి పూర్వ సభ్యులు  వీరగంధం ఆంజనేయులు సహకారంతో మేడూరి సత్యనారాయణ నిర్వహించారు .  
 




Comments

Popular posts from this blog