
"మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్" కు అభినందనలు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా నేను రచించిన " మహానటుడు, ప్రజానాయకుడు -ఎన్ .టి .ఆర్ " పుస్తకం మంచి ప్రయత్నమని చాలామంది అభినందనలు తెలుపుతున్నారు . ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఫిల్మ్ నగర్ క్లబ్ లో వచ్చింది . మే 3వ తేదీన నేను , చండ్ర మధు మాట్లాడుకునేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది . "అన్న గారి మీద నువ్వు పుస్తకం వ్రాయాలి, అందుకు నేను సహకరిస్తాను" అన్నాడు . "సమయం సరిపోదేమో ?" అన్నాను . "నువ్వు తలుసుకుంటే చేస్తావు "అన్నాడు . "సరే మధు " అన్నాను . అన్నగారితో నేను చేసిన ఇంటర్వ్యూ లు ఐదు వున్నాయి . మిగతావి ఏమేమి ఉండాలో నిర్ణయించుకున్నాను . ఈ విషయం తెలిసి తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ తాము ఆర్ధిక సహాయం అందిస్తానని చెప్పి మూడు రోజుల్లో చెక్ పంపించారు . దీంతో నా బాధ్యత మరింత పెరిగింది . అలా మే 5 నుంచి ఈ పుస్తకాన్ని రాయడం మొదలు పెట్టాను . ఆర్టిస్ట్ నాగ మోహన్ (డాకోజు శివ ప్రసాద్ సోదరుడు ) నా సూచనలతో అద్భుతమైన కవర్ పేజీ పంపించాడు. గ...