వెంకయ్య నాయుడు గారి ప్రశంస శుక్రవారం సాయంత్రం భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని హైద్రాబాద్ లోని వారి నివాసంలో కలసినప్పుడు ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఎదుటి మనిషిని గుర్తించి , గౌరవించే గొప్ప సంస్కారం వున్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారు . అందుకే ఆయనంటే నాకు అపారమైన గౌరవం, అభిమానం. . మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో జర్నలిస్టుగా నేను చేసిన ఇంటర్వ్యూ లు , ఆయన తో నాకున్న అనుభవాలతో రచించిన "మహానటుడు , ప్రజా నాయకుడు - ఎన్ .టి .ఆర్ " అన్న పుస్తకాన్ని బహుకరించాను.. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు . సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని , ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు.. ఎన్ .టి .ఆర్ కు కూడా వెంకయ్య నాయుడు గారంటే ప్రత్యేకమైన అభిమానం. ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతి కి నివాళిగా ఒక పుస్తకాన్ని వెలువరించిన నన్ను...