Popular posts from this blog
ఆత్రేయ మనసు నొచ్చుకున్న ఆ రెండు సంఘటనలు తెలుగు సినిమాను సగటు ప్రేక్షకుడు దగ్గరకు చేర్చిన రచయితల్లో ఆచార్య ఆత్రేయ మొదటి స్థానంలో ఉంటాడు . ఆయన మాటలు, పాటలు కూడా చక్కటి భావంతో , భాషతో వుంటాయని విమర్శకులు సైతం చెబుతారు. అయితే కాలానుగుణంగా ఆయన మాటల్లో పాటల్లో ద్వందార్ధాలు వస్తున్నాయని, అందుకే ఆయన్ని బూత్రేయ అని కూడా వ్యగ్యంగా పిలిచేవారు . అయితే ఆ విమర్శ పక్కన పెడితే తెలుగు సినిమా ఎదుగుదలకు ఆత్రేయ తన రచనల ద్వారా ఎంతో దోహదం చేశాడని చెప్పవచ్చు . ఆత్రేయ భౌతికంగా మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది. .సోమవారం ఆత్రేయ 32వ వర్ధంతి . ఈ సందర్భంగా ఆయన ప్రతిభా పాటవాలు, వ్యక్తిత్యం గురించి తెలుసుకుందాం . ఆత్రేయ అసలు పేరు కిలాంభి వెంకట నరసింహా చార్యులు . ఆయన 7 మే 1921న నెల్లూరు లోని మంగళంపాడు గ్రామంలో జన్మించాడు .హైస్కూల్ విద్యాభ్యాసం అనంతరం ఆయన్ని స్వాతంత్రోద్యమం బాగా ఆకట్టుకుంది . నాయకుల విన్యాసాలకు ప్రభావితం అయ్యాడు . చిన్న వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు. జైలు జీవితం ముగిచాక బయటికి వచ్చి...
'తారకరామం "ఆధునిక భగవద్గీత ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జనవరి 18న నా 'తారకరామం ' పుస్తకం పై సమీక్ష సమాలోచన జరిగింది . ఈ సభకు సంబంధించిన వార్త. తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన...

Comments
Post a Comment