ఈరోజు నుంచి వెంకయ్య నాయుడు గారికి స్వేఛ్ఛ
శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ రోజు నుంచి స్వేఛ్ఛా జీవి . ఉప రాష్ట్రపతి పదవి కాలం నిన్నటితో పూర్తి అయిపొయింది .
వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ స్వేఛ్ఛను కోరుకునే వ్యక్తి . అయితే ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిని తరువాత ప్రోటోకాల్ వల్ల ఆయన స్వేఛ్చగా ఉండలేకపోయారు . రాజ్య సభ సెక్రటేరిట్ నియమ నిబంధనలు మేరకు నడుచుకోవలసి వచ్చేది . అందుకు ఆయన నొచ్చుకున్న సందర్భాలు వున్నాయి .
మొన్న వీడ్కోలు సమావేశంలో వెంకయ్య నాయుడు గారు అదే చెప్పారు . "ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కాగా నాకు మాత్రం 11 నుంచి స్వాతంత్య్రం వస్తుంది . అంటే ప్రోటోకాల్ నియమ నిబంధనలు వుండవు" అని ఆనందంగా చెప్పారు .
రాజకీయ నాయకుడుగా, ఉప రాష్ట్రపతిగా ఆయన ఉన్నత ప్రమాణాలను పాటించి అందరికీ ఆదర్శ ప్రాయుడుగా, స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయమైన సేవలను అందించారు .
ఉప రాష్ట్రపతి గా పదవీ విరమణ చేసినా సమాజ సేవలో చురుకైన పాత్ర నిర్వహించాలని కోరుకుందాము. .
Comments
Post a Comment