
మోడీకి బాసటగా రిషి సునాక్ ఈనెల 9,10 తేదీల్లో న్యూ ఢిల్లీలో జరిగిన జి . 20 సదస్సు అనూహ్యంగా విజయవంతం అయ్యింది. ప్రపంచంలో భారత దేశం ప్రతిష్ట బాగా పెరిగింది . ప్రధాని నరేంద్ర మోడీ దూర ద్రుష్టి , సమర్ధత తో పాటు తెర వెనుక సహకారాన్ని అందించిన ఓ దేశ ప్రధాని గురించి ఇప్పుడు పలు కథనాలు వెలువడుతున్నాయి . జి 20 సదస్సులో అమెరికా , బ్రిటన్ , అస్ట్రేలియా , బ్రెజిల్ ,కెనడా ,చైనా ,ఫ్రాన్స్, జర్మనీ ,ఇండినేషియా , ఆర్జెంటినా ,ఇటలీ ,జపాన్ ,మెక్సికో , దక్షిణ కొరియా , రష్యా ,సౌదీ అరేబియా , దక్షిణాఫ్రికా , టర్కీ ,యూరోపిన్ కౌన్సిల్ అధ్యక్షుడు , యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు పాల్గొన్నారు . ఇక ఈ సదస్సులో ప్రత్యేక అతిధులుగా బాంగ్లాదేశ్ , ఈజిప్ట్ , మారిషస్ , నెథర్లాండ్ , సింగపూర్ ,ఒమన్ , నైజిరియా , స్పెయిన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాది నేతలు పాల్గొన్నారు . ఇందరు హేమాహేమీలు పాల్గొన్న ఈ జి 20 సదస్సు విజయంలో కీలక పాత్ర వహించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ . ఈ ఇద్దరూ మన ప్రధాని నరేంద్ర మోడీ కి అన్ని విధాలుగా తమ స...