మోడీకి బాసటగా రిషి సునాక్ 

ఈనెల 9,10 తేదీల్లో న్యూ ఢిల్లీలో జరిగిన జి . 20 సదస్సు అనూహ్యంగా విజయవంతం అయ్యింది. ప్రపంచంలో భారత దేశం ప్రతిష్ట బాగా పెరిగింది . ప్రధాని నరేంద్ర మోడీ దూర ద్రుష్టి , సమర్ధత తో పాటు  తెర వెనుక సహకారాన్ని అందించిన ఓ దేశ ప్రధాని గురించి ఇప్పుడు పలు కథనాలు వెలువడుతున్నాయి .  

జి 20 సదస్సులో అమెరికా , బ్రిటన్ , అస్ట్రేలియా , బ్రెజిల్ ,కెనడా ,చైనా ,ఫ్రాన్స్, జర్మనీ ,ఇండినేషియా , ఆర్జెంటినా ,ఇటలీ ,జపాన్ ,మెక్సికో , దక్షిణ కొరియా , రష్యా ,సౌదీ అరేబియా , దక్షిణాఫ్రికా , టర్కీ ,యూరోపిన్ కౌన్సిల్ అధ్యక్షుడు , యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు పాల్గొన్నారు . 


ఇక ఈ సదస్సులో ప్రత్యేక అతిధులుగా బాంగ్లాదేశ్ , ఈజిప్ట్ , మారిషస్ , నెథర్లాండ్ , సింగపూర్ ,ఒమన్ , నైజిరియా , స్పెయిన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాది నేతలు పాల్గొన్నారు . 

ఇందరు హేమాహేమీలు పాల్గొన్న ఈ జి 20 సదస్సు విజయంలో కీలక పాత్ర వహించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ . ఈ ఇద్దరూ మన ప్రధాని నరేంద్ర మోడీ కి అన్ని విధాలుగా తమ సహకారాన్ని ,ప్రోత్సహాన్ని అందించారు . 

నరేంద్ర మోడీ అంటే జో బైడెన్ అమితంగా ఇష్టపడతారు . మోడీలో సమర్ధత, సాతాను బైడెన్ చూశారు . అందుకే మోడీ అమెరికాకు వెళ్ళినప్పుడు జో బైడెన్ దంపతులు ఆయన్ని వైట్ హౌస్ కు ఆహ్వానించి సకల మర్యాదలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు . అక్కడ నుంచి ఈ ఇద్దరి నాయకుల మంధ్య ఆత్మీయ అనుబంధం ఏర్పడింది . 

ఇక రిషి సునాక్ భారతీయ మూలాలు వున్న వ్యక్తి . సునాక్ పూర్వీకులు పంజాబ్ నుంచి వెళ్లి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు . ఆయన తండ్రి యశ్ వీర్ కెన్యాలో జన్మించారు . తల్లి ఉష టాంజానియాలో జన్మించారు . ఆతరువాత వీరి కుటుంబం ఇంగ్లాండ్ కు వెళ్లి స్థిరపడింది . రిషి సునాక్ అక్కడే జన్మించారు . 

రిషి సునాక్ పూర్వీకులు భారత దేశం వదలిపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ దేశమైనా , ఈ సంస్కృతి అన్నా ప్రాణంగా భావిస్తారు అంతేకాదు ఇప్పటికీ ఆ కుటుంబం హిందూ మత ఆచారాలనే పాటిస్తారు . జి 20 సదస్సు కోసం రిషి ఇంగ్లాండ్ నుంచి తన భార్య అక్షతా మూర్తి తో వచ్చారు . ఈ గడ్డ మీద కాలు పెట్టగానే ఆయన ఎంతో పులకించి పోయారు . నేను హిందువుగా ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నా అని ప్రకటించారు . 

అక్షత ఎవరో కాదు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి , సుధా మూర్తి కుమార్తె . అంటే రిషి భర్త దేశానికి అల్లుడు . ఆమాట అంటే ఆయన లో చెప్పలేనంత సంతోషం కలుగుతుంది . 


అందుకే జి . సదస్సు భారత దేశంలో జరిగే సందర్భంలో రిషి సునాక్ ప్రధాని నరేంద్ర మోడీ కి అన్ని విధాలుగా సహకారాన్ని అందించారు . ముఖ్యంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 20 దేశాల నేతలు ఏకగ్రీవంగా ఆమోదించడంలో రిషి కీలక పాత్ర వహించాడని తెలుస్తుంది. ఆ తరువాత మరికొన్ని కీలక అంశాల విషయంలో కూడా రిషి మోడీకి బాసటగా ఉన్నారట . ఇది  భారత దేశం పట్ల ఆయనకున్న అపారమైన అభిమానానికి నిదర్శనం . 

రిషి సునాక్ ఈ పర్యటనలో ఢిల్లీలో వున్న  అక్షర ధామం దేవాలయాన్ని భార్య అక్షత మూర్తితో కలసి సందర్శించారు . ఇంగ్లాండ్ దేశ ప్రధాని లా ఏ మాత్రం దర్పం చూపించకుండా , ప్రోటోకాల్ ను పక్కన పెట్టి  ఒక సామాన్యుడిలా సందర్శించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది . 


ఈ దంపతులిద్దరూ వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని వెళ్లే దృశ్యం అపూర్వంగా ఉందని , రిషి సునాక్ హిందువు అయినందుకు, వారి నిరాడంబరతను   పలువురు ప్రశంసిస్తున్నారు . అక్షర దమలో ఈ దంపతులు ఒక గంటసేపు వుంది శ్రద్దగా పూజలు నిర్వహించారు . 

ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన బ్రిటన్ కు ఇప్పుడు భారత దేశ మూలాలున్న వ్యక్తి , అందునా ఒక హిందువు రిషి సునాక్ ప్రధాని కావడం మన అందరికీ గర్వకారణం . అంటే కాదు దేశం పట్ల అతికున్న మమకారాన్ని పరోక్షంగా చాటుకున్నాడు . 

రిషి సునాక్, మిమ్మల్ని చూసి మేమంతా  గర్విస్తున్నాము . 

Comments

Popular posts from this blog