అసలు సిసలు హీరో రజనీకాంత్ 

తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా   హీరో అని నిరూపించుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ . 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖమంత్రి నారా చంద్ర బాబు నాయుడును రాజకీయంగా దెబ్బతీయడానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి జైల్లో పెట్టింది . దీనిపై చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వల్ల ఆర్ధికంగా  లాభపడ్డ వారు, రాజకీయంగా ఎదిగినవారు తెలుగు సినిమా  రంగంలో చాలా మంది వున్నారు . కానీ , చంద్ర బాబుపై అక్రమ కేసు బనాయించారని అటు ప్రధాన మీడియా ,ఇటు సోషల్ మీడియా , జాతీయ మీడియా సైతం ప్రభుత్వాన్ని , సి .ఐ .డి ని , వెనుకనుండి నడిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నాయి. 


అయినా మన సినిమా హీరోలు చంద్ర బాబు నాయుడు అరెస్ట్ నిరసన వ్యక్తం చెయ్యలేదు. ట్విట్టర్ లో తెలుగు దేశం వారికి ధైర్యం చెప్పలేదు . చంద్ర బాబు నాయుడు కుమారుడు లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడలేదు 

ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేశ్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారన్న వార్త  తెలుగు దేశం శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తుంది . 

'చంద్ర బాబు నాయుడు పోరాట యోధుడు , ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన పధకాలు ,చేసిన అభివృద్ధి  ఆయనకు రక్షగా నిలుస్తాయి ' అని రజనీకాంత్ లోకేశ్ చెప్పి ధైర్యంగా ఉండమన్నారు . 

రజనీకాంత్ తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు . ఒక సినిమా హీరోకు సామాజిక భాద్యత కూడా ఉంటుందని రజనీకాంత్  నిరూపించారు . 

మన హీరోలు తెరమీద మాత్రమే తమ ప్రతాపం చూపిస్తారు . నిజ జీవితంలో  మాత్రం జీరోలే .

Comments

Popular posts from this blog