
డాక్టర్ కె .వి. రమణాచారి గారు మెచ్చిన "శకపురుషుడు" ఎన్ .టి . ఆర్ శత జయంతి సందర్భంగా ఎన్ .టి .ఆర్.సెంటినరీ కమిటీ "శకపురుషుడు " ప్రత్యేక సంచికను వెలువరించింది . ఈ సంచికలో సినిమా విభాగానికి నేను సంపాదకుడుగా పనిచేశాను . ఈ సంచిక చాలా బాగుందని , ఎన్ .టి .రామారావు గారికి వారి శతాబ్ది సంవత్సరంలో అపూర్వ నివాళి అని పుస్తకం చూసిన దేశ , విదేశాల్లోని తెలుగు వారంతా ప్రశంసిస్తున్నారు. "శకపురుషుడు " పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె .వి . రమణాచారి గారికి బహుకరించాను. రమణ చారి గారు ఆ పుస్తకాన్ని చూసి "నా నలభై ఐదేళ్ల ప్రజా జీవితంలో ప్రత్యేక సంచికలు ఎన్నో చూశాను, అయితే "శకపురుషుడు" అన్నింటిలో చాలా చాలా ప్రత్యేకం . ఇందులో ఆర్టికల్స్ ఎంపిక , లే అవుట్ ,పేపరు , ప్రింటింగ్ అన్నీ సూపర్ , ముఖ్యంగా "శకపురుషుడు " అనే పేరు , కవర్ పేజీ ఎంపిక, చూడగానే అన్న గారి రాజసం కనిపిస్తోంది. ఇది మహా ప్రసాదంగా భావిస్తున్నాను. భగీరథా , నిన్ను నలభై నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నా , నువ్వు ఏది డబ్బు కోణంలో చూడవు , అదే నీ ప్రత్యేకత. శ్రీకృష్ణదేవరా...