రామోజీ రావు గారు స్ఫూర్తి ప్రదాత 

నవంబరు 16 పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పుట్టినరోజు. 

86 సంవత్సరాలు పూర్తి చేసుకొని 87వ సంవత్సరంలోకి ప్రవేశించారు . 

రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న  

వెంకటసుబ్బమ్మ,  వెంకట సుబ్బారావుదంపతులకు జన్మిచారు . 

1974 ఆగష్టు 10న రామోజీరావు గారు విశాఖపట్నంలో ఈనాడు దిన పత్రికను ప్రారంభించారు . ఆ తరువాత 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో  మరో ఎడిషన్ ప్రారంభించారు . ఈనాడు దేశంలోనే పెను సంచలనం సృష్టించింది . 


మార్గదర్శి, ఉషాకిరణ్ మూవీస్, మయూరి ఫిలిమ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైన సంస్థలను ఆయన ప్రారంభించారు . ఈరోజు ఆయన పేరు ప్రపంచంలోనే ప్రముఖంగా వినిపిస్తుంది .  

తెలుగు పత్రికా రంగంలోనూ , సినిమా రంగంలోనూ రామోజీ రావు గారు సరికొత్త చరిత్రను సృష్టించారు. నవ్యతకు , నాణ్యతకు ఆయన మరో పేరు. 

రామోజీ  రావు గారితో నేను మొదటిసారి 1983 లో ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి లో పనిచేసేవాడిని . 

ఆ తర్వాత మళ్ళీ 1986లో మరొక ఇంటర్వ్యూ చేశాను .  

1999 లో   రామోజీ ఫిలిం సిటీ గురించి ఇంటర్వ్యూ చేశాను . అలా రామోజీరావు గారితో మూడు ఇంటర్వ్యూ లు చేశాను . 

నేనంటే వారికి ఎంతో అభిమానం. 1987లో జరిగిన నా  వివాహానికి, అట్లూరి  రామారావు గారు, త్రిపురనేని కేశవ రావు గారితో  రామోజీ రావు గారు హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వర రావు , రామానాయుడు గారు , దుక్కిపాటి మధుసూదన రావు గారు , నండూరి రామమోహన్ రావు గారు లాంటి ప్రముఖులు వివాహానికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు . 


రామోజీ రావు గారు ఇలాంటి  మరెన్నో పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలి, ఎందరికో స్ఫూర్తినివ్వాలి . 


Comments

Popular posts from this blog