కోమటిరెడ్డికి 'తారకరామం'


ఈరోజు తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారిని కలసి 'తారకరామం ' పుస్తకాన్ని బహుకరించాను . ఎన్ .టి .రామారావు గారి జయంతి సందర్భంగా ఎన్ .టి .ఆర్. శత జయంతి కమిటీ ఈ పుస్తకాన్ని వెలువరించింది , దీనికి నేను సంపాదకత్వం వహించానని మంత్రి గారికి చెప్పాను . 'తారకరామం' లాంటి మంచి పుస్తకాన్ని తనకు బహుకరించినందుకు మంత్రి గారు సంతోషం వ్యక్తం చేశారు.
నాతో పాటు నిర్మాత చిన బాబు (డీవీకే రాజు) , సీనియర్ జర్నలిస్టులు ఉమామహేశ్వర రావు , దుర్గ వడ్లమాని కూడా మంత్రి గారిని కలవడం జరిగింది .
చిన బాబు గారు తమ తండ్రి డీవీఎస్ రాజు గారి జీవిత చరిత్ర 'అంతరంగ తరంగాలు ' దుర్గ గారు సూర్యకాంతమ్మ శాశత జయంతి సందర్భంగా వెలువరించిన 'తెలుగింటి అత్త గారు ' పుస్తకాలను వెంకట రెడ్డి గారికి బహుకరించారు .
ఇంత మంచి పుస్తకాలను తనకు బహుకరించినందుకు ఆయన మాకు కృతజ్ఞతలు తెలిపారు .
మేము నలుగురం గత నెలలో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల కమిటీలో సభ్యులుగా పనిచేశాము . గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినందుకు సినిమాటోగ్రఫీ మంత్రిగా వెంకట రెడ్డి గారికి అభినందనలు తెలిపాము .

Comments

Popular posts from this blog