ఎన్ .టి .ఆర్ 30వ వర్ధంతి
ఈరోజు మహానటుడు , ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి . అప్పుడు ఆ మహానటుడు మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది .
ఎన్ .టి . రామారావు గారితో నాకు 1977 నుంచి పరిచయం వుంది . జర్నలిస్టు గా అనేక ఇంటర్వ్యూలు చేశాను .
2023 రామారావు గారి శత జయంతి సంవత్సరంసందర్భంగా వారితో నాకున్న అనుబంధం , ఆయన వ్యక్తిత్వం గురించి "మహా నటుడు - ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ " అన్న పుస్తకాన్ని వెలువరించాను .
ఎన్ .టి .ఆర్ .శాశత జయంతి కమిటీ ఆధ్వర్యంలో "శకపురుషుడు ", "తారకరామం " అన్న పుస్తకాలకు సంపాదకత్వం వహించాను .
రామారావు గారి వ్యకిత్వం చాలా విలక్షణమైనది.
రామారావు గారి వర్ధంతి నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది .
ఆ మహనీయ కళాకారునికి స్మరిస్తూ ... !

Comments
Post a Comment