Posts

Showing posts from March, 2026
  సాహిత్య రంగంలో  భగీరథ ప్రస్థానం  తెలుగు సినిమా మరియు సాహిత్య రంగంలో భగీరథది ఓ ప్రత్యేకమైన శైలి . నాలుగున్న దశాబ్దాల నిరంతర కృషి , పట్టుదల  భగీరథను సమున్నతమైన స్థానంలో నిలబెట్టింది .   సినిమా పాత్రికేయుడు గా ప్రారంభమై , రచయితగా , కవిగా , చారిత్రిక  పరిశోధకులుగా  బహుముఖాలుగా ఎదిగారు  భగీరథ.  1956 మే 1వ తేదీన బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామంలో రామస్వామి , వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు భగీరథ. ప్రాధమిక విద్యను  నాగండ్లలో పూర్తి చేసి పావులూరు హైస్కూల్ లో పదవ  తరగతి వరకు చదివాడు . అప్పటికే నాగండ్ల , పావులూరు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటయ్యింది . పదవ తరగతి చదువుతున్నప్పుడే కంద పద్యాలు రాయడం అలవాటయ్యింది . తెలుగు అధ్యాపకుడు యాచమనేని మాధవరావు ప్రోత్సహించాడు . 1971లో భగీరథ తన 15వ  ఏట ఇంటర్మీడియేట్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు . భగీరథ అన్న కోటేశ్వర రావు ఇంట్లో ఉండి సత్యమ్మ నరసింహారావు స్మారక కలశాల లో చదువుకోసాగాడు . భగీరథ చిక్కడపల్లి లో ఉండేవాడు . ఆ ప్రక్కనే  అశోక్ నగర్ లో కేంద్ర గ్రంథాలయం  ఉండేది . భగీరథ ఆ గ్రంథాలయానికి...