పోస్ట్‌లు

మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
  తెలంగాణ తొలి తరం నట రత్నం  పైడి జైరాజ్  తెలంగాణ ప్రాంతం నుంచి బొంబాయి నగరానికి వెళ్లి తన ఉనికిని చాటుకొంటూ హిందీ చిత్ర రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన  నటుడు పైడి జైరాజ్. జైరాజ్. శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ సమకాలీకుడైన జైరాజ్ ప్రతిభావంతుడైన నటుడు , నిర్మాత , దర్శకుడు . 'భారత కోకిల' సరోజిని నాయుడు భర్త ముత్యాల గోవింద రాజులు నాయుడు జైరాజ్ కు స్వయానా మేనమామ. అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ ఆయన చెప్పుకోలేదు . జైరాజ్ 11 మూకీ చిత్రాల్లో , 156 టాకీ చిత్రాల్లో నటించాడు .  హిందీ తో పాటు ఉర్దూ , మరాఠీ , గుజరాతీ భాషల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు .  జైరాజ్ పూర్తి పేరు పైడిపతి జైరుల  నాయుడు.  1909 సెప్టెంబరు 28న  కరీంనగర్ లో  అచ్యుతయ్య నాయుడు, తాయారమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా ఆ కుటుంబం హైదరాబాద్ కు వచ్చేసింది . జైరాజ్ విద్యాభ్యాసం ఇక్కడే సాగింది . చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఏర్పడింది . నిజాం కళాశాలలో బీఎస్సీ చదువుతూ నాటకాల్లో నటించేవాడు . క్రమంగా చదువుకున్నా నాటకాలక...
చిత్రం
    అక్షరాల... సినిమా బయోపిక్‌ భగీరథ మీర్జాపురం రాణి... కృష్ణవేణి   ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్‌ రోల్‌ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్‌గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత గా , శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.   జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం.  రచ...
  సాహిత్య రంగంలో  భగీరథ ప్రస్థానం  తెలుగు సినిమా మరియు సాహిత్య రంగంలో భగీరథది ఓ ప్రత్యేకమైన శైలి . నాలుగున్న దశాబ్దాల నిరంతర కృషి , పట్టుదల  భగీరథను సమున్నతమైన స్థానంలో నిలబెట్టింది .   సినిమా పాత్రికేయుడు గా ప్రారంభమై , రచయితగా , కవిగా , చారిత్రిక  పరిశోధకులుగా  బహుముఖాలుగా ఎదిగారు  భగీరథ.  1956 మే 1వ తేదీన బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామంలో రామస్వామి , వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు భగీరథ. ప్రాధమిక విద్యను  నాగండ్లలో పూర్తి చేసి పావులూరు హైస్కూల్ లో పదవ  తరగతి వరకు చదివాడు . అప్పటికే నాగండ్ల , పావులూరు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటయ్యింది . పదవ తరగతి చదువుతున్నప్పుడే కంద పద్యాలు రాయడం అలవాటయ్యింది . తెలుగు అధ్యాపకుడు యాచమనేని మాధవరావు ప్రోత్సహించాడు . 1971లో భగీరథ తన 15వ  ఏట ఇంటర్మీడియేట్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు . భగీరథ అన్న కోటేశ్వర రావు ఇంట్లో ఉండి సత్యమ్మ నరసింహారావు స్మారక కలశాల లో చదువుకోసాగాడు . భగీరథ చిక్కడపల్లి లో ఉండేవాడు . ఆ ప్రక్కనే  అశోక్ నగర్ లో కేంద్ర గ్రంథాలయం  ఉండేది . భగీరథ ఆ గ్రంథాలయానికి...