రామానాయుడు గారు @ 90 ఈరోజు పద్మభూషణ్ , మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే డి .రామానాయుడు గారి 90వ జయంతి రామానాయుడు గారు మనకు దూరమై అప్పుడే 11 సంవత్సరాలు అవుతుంది . అయినా వారి జ్ఞాపకాలు మన మనస్సులో పదిలంగానే ఉన్నాయి . భారతీయ సినిమా చరిత్రలో రామానాయుడు గారిది ఓ సువర్ణ అధ్యాయం . భారతీయ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక నిర్మాత రామానాయుడు గారు . నిర్మాతగా , స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ , డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ సంస్థల అథినేతగా ఆయన బహుముఖాలుగా ఎదిగారు . రామానాయుడు గారు బాపట్ల పార్లమెంట్ సభ్యుడుగా తమ మాతృ భూమి ఋణం తీర్చుకోవడానికి కోట్ల రూపాయల స్వంత డబ్బు ఖర్చు చేసిన మానవతావాది . రామానాయుడు గారితో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి . నాయుడు గారు నాకు ప్రాతః స్మరణీయులు.