విలక్షణ నటుడు నటుడు నారాయణ రావు నటుడు, నిర్మాత జి .వి. నారాయణరావు బుధవారం సాయంత్రం మృతి చెందారు. 1973లో నారాయణ రావు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందారు. అదే ఇనిస్టిట్యూట్ లో రజనీకాంత్, చిరంజీవి కూడా శిక్షణ పొందారు . వారిద్దరితో నారాయణ రావు కు స్నేహం వుంది . 1976లో దర్శకుడు కె .బాలచందర్ 'అంతులేని కథ ' తెలుగు చిత్రంలోనారాయణరావును సినిమారంగానికి పరిచయం చేశాడు . ఆ సినిమాలో 'తాళికట్టు శుభ వేళ .. మెడలో కళ్యాణ మాల ' అనే పాటలో నారాయణ రావు చూపించిన అభినయం ఆయన్ని ప్రభిభావంతుడైన నటుడుగా నిలబెట్టింది . ఆ సినిమాలో ఉత్తమ సహాయ నటుడుగా నారాయణరావు ను ఎంపిక చేసి ప్రభుత్వం నంది అవార్డును ప్రదానం చేసింది. అదే సంవత్సరం నిర్మాత ఎమ్మెస్ రెడ్డి బి .వి .ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించిన 'ముత్యాల పల్లకి ' చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు . ఇందులో జయసుధ కథానాయిక. ఆ తరువాత సంవత్సరం 1977లో దర్శకుడు మృణాల్ సేన్ తెలుగులో నిర్మించిన 'ఒక ఊరి కథ ' సినిమాలో ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశారు . ఏ .పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో...