పోస్ట్‌లు

మే, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
  దర్శకుడు కృష్ణారెడ్డి  @ 65 ఈరోజు దర్శకుడు ఎస్ .వి కృష్ణ రెడ్డి గారి 65వ పుట్టిన రోజు . తెలుగు సినిమా రంగంలో కృష్ణా రెడ్డి గారిది ప్రత్యేకమైన శైలి . అసభ్యత , అశ్లీలత  లేకుండా కుటుంబ  సమేతంగా చూడతగ్గ 42 ఆరోగ్యకరమైన , వినోదాత్మక చిత్రాలను తెలుగు వారికీ అందించారు . ఆయన తాజా చిత్రం 'వేదవ్యాస్ '.  కృష్ణా రెడ్డి కి చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది . మద్రాసువెళ్లి 'పగడాల పడవ ' అనే చిత్రం లో నటించారు . కానీ ఆ చిత్రం విడుదల కాలేదు .  అదే సమయంలో చిన్ననాటి మిత్రుడు అచ్చి రెడ్డి ఆసరాగా నిలబడ్డారు . ఇద్దరూ హైదరాబాద్ వచ్చి  వ్యాపారం చేస్తూ 1991లో 'కొబ్బరి బొండం 'అనే చిత్రం తో నిర్మాణంలో అడుగు పెట్టారు . ఆ సినిమా విజయవంతమయ్యింది . 1993లో కృష్ణారెడ్డి దర్శకుడుగా 'రాజేంద్రుడు - గజేంద్రుడు ' రూపొందింది . ఆ సినిమా విజయం సాధించింది . ఆ వెంటనే 'మాయలోడు ' సినిమా రూపొందింది . ఈ సినిమా కూడా  సూపర్ హిట్ అయ్యింది .  ఆ తరువాత  నెంబర్ వన్ , యమలీల , శుభ లగ్నం , టాప్ హీరో , వజ్రం , ఘటోత్కచుడు, గన్ షాట్, వినోదం , మావిచిగురు ... ఇలా కృష్ణారెడ్డి విజయ పరంపర...
చిత్రం
  సూపర్ స్టార్  కృష్ణ 83వ జయంతి  ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి అనే సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు . రాఘవయ్య చౌదరి , నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31న తెనాలిలో ని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు .  కృష్ణ కు చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది. చదువు పూర్తి అయిన తరువాత మద్రాసు వచ్చాడు . 1962లో వ్. మధుసూదన రావు దర్శకత్వం వహించిన 'పదండి ముందుకు' అనే సినిమాలో చిన్న  వేషం వేశారు . ఈ సినిమాను కొంగర జగ్గయ్య నిర్మించి ప్రధాన పాత్రలో నటించారు .  అదే సంవత్సరం అక్కినేని నాగేశ్వర రావు కథానాయకుడుగా కె .ప్రత్యగాత్మ దర్శకత్వం వహించి 'కుల గోత్రాలు ' సినిమాలో కూడా  చిన్న పాత్రలో నటించారు . 1963లో ఎన్ .టి .ఆర్ .కథానాయకుడుగా మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన 'పరువు - ప్రతిష్ఠ ' చిత్రంలో కూడా కృష్ణకు చిన్న పాత్రే లభించింది .  ఆ తరువాత కొంతకాలం వేచి వున్నారు . 1965లో ఆదుర్తి సుబ్బారావు 'తేనే మనసులు ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కృష్ణకు కథానాయకుడుగా అవకాశం కల్పించారు . అయితే అప్పుడు సినిమా పంపిణీదారులు కొత్త హీరో వద్దు , పాత వారిని పెట్టమని ఆదుర్తి మీద వత్...
చిత్రం
  'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ జ్ఞాపకాలు  నేను రచించిన రెండవ కవితా సంపుటి 'అక్షరాంజలి ' ని అప్పటి మద్రాస్ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు.  2015 జూన్ 1వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో దీనిని ఆవిష్కరించారు .  నా 'మానవత' పుస్తకం కూడా 1980 జూన్ 1వ తేదీనే శ్రీశ్రీ గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు . అప్పుడు శ్రీ శ్రీ గారు మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు .  అక్షరాంజలి కవితా సంపుటిని కూడా గవర్నర్ రోశయ్య గారు మద్రాసు నుంచి వచ్చి జూన్ 1న ఆవిష్కరించారు . బహుశ ఇలా జరగడం మాత్రం యాదృచ్చికం కావచ్చు , కానీ నాకు మాత్ర రెండు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి . అక్షరాంజలి  వెలుగు చూడటానికి కారకులు నిర్మాత శ్రీ కళ్యాణ్ గారు . దీనిని డాక్టర్ కె .వి . రమణాచారి గారికి అంకితం చేశాను . అప్పటి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు . మా నాగండ్ల ప్రముఖులు శ్రీ చెరుకూరి హరి ప్రసాద్ గారు , శ్రీ పుల్లెల గోపీచంద్ గారు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు . డాక్టర్ కె .వి .కృష్ణకుమారి , డాక్టర్ శ్రీనివాస రెడ్డి , డాక్టర్ ఉమాపతి వర్మ ...
చిత్రం
  "మానవత"కు 46 సంవత్సరాలు  నేను రచించిన కవితా సంపుటి "మానవత "కు 46సంవత్సరాలు అయ్యిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . అప్పుడే ఇన్ని సవత్సరాలు గడిచిపోయాయి?  "మానవత" నా తొలి పుస్తకం . దీనికి మహాకవి శ్రీ శ్రీ ముందుమాట వ్రాసి , స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు . నా సాహిత్య జీవితానికి 'మానవత ' నాంది పలికింది . 1980 జూన్ 1వ తేదీన ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంధాలయ సంస్థలో 'మానవత ' పుస్తకావిష్కరణ సభను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రఘురామ్  ఏర్పాటు చేశారు . నాటి  సభలో  ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు గారు , నిర్మాత దర్శకులు యు .విశేశ్వర రావు గారు , సీనియర్ జర్నలిస్ట్ శ్రీ జి. ఎస్. వరదాచారి, గురువు శ్రీ ఆచార్య తిరుమల , హై కోర్టు లాయర్ శ్రీ అడుసుమిల్లి పాండురంగారావు గారు పాల్గొన్నారు. ఇదొక మర్చిపోలేని మధుర జ్ఞాపకం .  'ఈ భగీరథ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందిస్తారు , ముందుగా నాకా అవకాశం వచ్చింది ' అని మహాకవి శ్రీ శ్రీ పేర్కొన్నారు . ఈ సభలో నిర్మాత దర్శకుడు పి .పుల్లయ్య పాల్గొని "ఒరే అబ్బాయి నీకు  గ...
చిత్రం
  దాసరి నారాయణ రావు గారి సమాధి పట్ల నిర్లక్ష్యం ? ఈరోజు దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి  9వ వర్ధంతి. ఆయన 30 మే 2017లో తన 75వ సంవత్సరంలో మరణించారు .  దాసరి నారాయణ రావు గారికి వికారాబాద్ కు  వెళ్లే దారిలో  మొయినాబాద్  దగ్గర ఫామ్‌హౌస్‌ ఉంది .  అక్కడ దాసరి పద్మ గారి సమాధి కూడా ఉంది .పద్మ గారు అక్టోబర్ 28, 2011లో కన్నుమూశారు.   ఆ సమాధి ప్రక్కనే దాసరి నారాయణ రావు సమాధిని కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు.   అయితే మొయినాబాద్  ఫామ్‌హౌస్‌లో ఉన్న  దాసరి మరియు పద్మ సమాధులు  పిచ్చి మొక్కలు , ముళ్ల చెట్లతో దయనీయంగా ఉందనే ఓ వీడియో సోషల్ మీడియా లో ఈరోజు రావడంతో చిత్ర పరిశ్రమ నివ్వెర పోయింది. తెలుగు సినిమాలో అఖండంగా వెలిగిన దాసరి నారాయణ రావు గారికి ఇలాంటి స్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. హైద్రాబాద్ కు దూరంగా ఉండటం , సమాధిని వారి కుటుంబ సభ్యులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారనే ఉద్దేశ్యతో సినిమా రంగం వుంది . దాసరి నారాయణ రావు గారికి హరి హర ప్రభు, అరుణ్ కుమార్ , హేమాలయా కుమారి, ముగ్గురు సంతానం .  దాసరి కుమార్తె హిమాలయ కుమారి ...
చిత్రం
  అన్న గారితో అనుబంధం  మహా నటుడు , నాయకుడు , తెలుగు వారికి ప్రాతః స్మరణీయుడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి . ప్రపంచంలో వున్నా తెలుగు వారందరూ విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటున్నారు . రామారావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలున్నాయి . రామారావు గారి శతాబ్ది సందర్భంగా 'మహానటుడు, ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ .అన్న పుస్తకాన్ని రచించాను . టి .డి .జనార్దన్ గారు చైర్మన్ గా ఏర్పాటైన కమిటీలో నేను కార్యదర్శిని . మా కమిటీ ఆధ్వర్యంలో  'శకపురుషుడు ', 'తారకరామం ' అన్న గ్రంథాలు వెలువడ్డాయి . వీటికి నేను  సంపాదకత్వం వహించాను .  నిన్ననే వంశీ రామరాజు నాకు 'వంశీ ఎన్.టి.ఆర్.' మహానంది గ్లోబల్ అవార్డు ప్రదానంను ప్రదానం చేశారు .
చిత్రం
  తెలుగు సినిమా ప్రస్థానం .... !? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యతో ప్రభుత్వం ఆలస్యంగానైనా ఎఫ్ .డి .సి . బోర్డును  నియమించింది . ఈ బోర్డు చైర్మన్ గా పంపిణీదారు పి .భరత్ భూషణ్ , వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ , సభ్యులుగా హీరో సుమన్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు , హీరో శివాజీ , రచయిత బుర్ర సాయి మాధవ్, నటి ఝాన్సీ , దర్శకుడు సముద్ర , ఛాయాగ్రాహకుడు మీర్ , నిర్మాత వివేక్ కూచిపూడి ,సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర రావు తదితరులు ఆదివారంనాడు విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు . ఈ కార్యక్రమంలో  సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , శాసన సభ్యులు , హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ పాల్గొని ఆద్యంతం ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నడిపించారు . ఈ కార్యక్రమం కోశాయ్ హైదరాబాద్ నుంచి నిర్మాతలు సి .కళ్యాణ్ , తుమ్మల ప్రసన్న కుమార్ , అంబికా కృష్ణ , మాదాల రవి , ప్రతాని రామకృష్ణ గౌడ్ , వల్లభనేని అనిల్ కుమార్ , దర్శకులు వి .ఎన్ .ఆదిత్య , జి  రామ్ ప్రసాద్ మొదలైనవారు హాజరయ్యారు.  ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక వచ్చినందుకు సంతోషం . ...
చిత్రం
 యమున మౌనపోరాటం ఈటీవీ...ఇప్పుడు మరో సరికొత్త డైలీసీరియల్ తో అలరించబోతోంది. ఈ సీరియల్ ప్రత్యేకత ఏమింటే...మూడు దశాబ్దాల క్రితం అసాధారణ విజయాన్ని  సాధించిన ఉషాకిరణ్ మూవీస్ ‘మౌనపోరాటం’ చిత్రానికి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రావడం. అడవిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పెరిగిన ఓ గిరిజన యువతిని, పెద్ద ఉద్యోగం చేస్తూ – చిన్న మనసున్న ఓ పట్నం యువకుడు మోసం చేస్తే...అతని కారణంగా గర్భం దాల్చి, కడుపులోని బిడ్డకు తండ్రెవరో నిరూపించుకోవాల్సిన దయనీయ దుస్థితిలో ..ఆ ఒంటరి యువతి సాగించిన ‘మౌనపోరాటం’ ఆ రోజుల్లో అంతులేని సంచలనం కలిగించింది. మాయగాళ్ళ  బారిన పడి దిక్కుతోచక రోదించే ఎంతో మంది అబలలకు, అమాయకులకు మార్గం చూపిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకుంది.  ఓ గిరిజన యువతి నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు తెరరూపం కల్పించిన ‘మౌనపోరాటం’ చిత్రంలో యమున , వినోద్ కుమార్ హీరో హీరోయిన్లు గా నటించారు. రామోజీ రావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయని ఎస్.జానకి సంగీతం అందించగా, మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. దాదాపు ముప్ఫై మూడేళ్ళ తర్వాత మౌనపోరాటం సినిమాకు కొనసాగింపుగా ఇదే పేరుతో సరికొత్త డైలీ సీరియల్ ప్...
చిత్రం
  భగీరథ ప్రయత్నం   మీర్జాపురంరాణి - కృష్ణవేణి చక్కని బయోగ్రఫీ ఇది. శ్రీమతి కృష్ణవేణి నటీ,గాయకురాలు ,నిర్మాత ,సొంత స్టుడియో వ్యవహారాలు చూసుకునే వారు.ఆమెను అందరూ సి.కృష్ణవేణి అనేవారు .ఆమె పూర్తి పేరు చిత్తజల్లు.కృష్ణవేణి.ఈ పేరు వెనక ఒక విచిత్రమైన కథ వుంది.అసలు ఆమె పుట్టినింటి పేరు యర్రంశెట్టి.అయితే మీర్జాపురం రాజా వారిని పెళ్లిచేసుకుని మేకా.కృష్ణవేణి అయింది కానీ ఆమె తనను తండ్రిలాగా చూసుకున్న చిత్తజల్లు.పుల్లయ్య గారిమీద గౌరవంతో ఆయన ఇంటిపేరునే తాను స్వీకరించి చిత్తజల్లు.కృష్ణవేణి అయింది .ఈ విషయంలో రాజావారు కూడా యేమీ అభ్యంతరం చెప్పకపోవడం గొప్ప విషయం. రచయిత భగీరథ గారు ఆమె కుటుంబనేపథ్యమూ ,చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి సవతితల్లి నిరాదరణ వలన పిన్నీ,బాబాయిల సంరక్షణలో పెరగడమూ అన్నీ వివరంగా రాశారు. చిన్ననాడే ఆమెకు నటన పట్ల వున్న మక్కువతో నాటకాలలో నటిస్తుంటే చూసిన సి.పుల్లయ్య "సతీ అనసూయ"   అనే పిల్లల సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నారు.ఆయన ఆ సినిమాలో నటించిన పిల్లలందరినీ యెంతో ప్రేమగా చూసుకునేవారు .ప్రేమాభిమానాలకు కరువాచిన కృష్ణవేణి  పుల్లయ్య దంపతులలో తన తల్లిదండ్రుల...
చిత్రం
  " ఈ విజయం నాది కాదు , నా తండ్రిది " - నాగార్జున  అక్కినేని నాగేశ్వర రావు గారు తన రెండవ కుమారుడు నాగార్జునను హీరోగా సినిమా రంగానికి పరిచయం చేస్తూ 'విక్రమ్ ' అనే చిత్రాన్ని రూపొందించారు .  సీనియర్ దర్శకులు వీరమాచనేని మధుసూదన రావును ఎంపిక చేసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి అక్కినేని అన్నపూర్ణమ్మ  సమర్పించారు . నాగార్జున జోడీగా శోభనను ఎంపిక చేశారు . అక్కినేని నాగేశ్వర రావు గారి పుట్టినరోజు సందర్భంగా 20 సెప్టెంబర్ 1985లో మొదలైన ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్ , కర్ణాటక రాష్ట్రాల్లో  జరిపి 'విక్రమ్' చిత్రాన్ని 23 మే 1986న విడుదల చేశారు.  అక్కినేని నాగేశ్వర రావు అభిమానులంతా ఎదురు చూసిన రోజు1986  మే 23 శుక్రవారం. ఈ సినిమాను నైజాం లో ఎస్ .ఎన్ .ఏ .పి , సీడెడ్ లో వి . ఎమ్ .సి ,  నెల్లూరులో రాజ రాజేశ్వరి ఫిలిమ్స్, గుంటూరు లో చదలవాడ బ్రదర్స్,  కృష్ణలో  బాలాజీ పిక్చర్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో అన్నపూర్ణ సినీ చిత్ర , వైజాగ్ , శ్రీకాకుళం లో  క్రాంతి పిక్చర్స్ , కర్ణాటకలో శ్రీ లక్ష్మి వినాయక పిక్చర్స్ ద్వారా విడుదల చే...
చిత్రం
  కుద్రేముఖ్ లో వెంకట్, నాగార్జున అప్ సెట్  అక్కినేని నాగార్జున , శోభన జంటగా వి .మధుసూదన రావు గారు దర్శకత్వంలో అక్కినేని అన్నపూర్ణమ్మ గారు నిర్మిస్తున్న 'విక్రమ్' సినిమా 1985 సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారి పుట్టినరోజున ' ప్రారంభమైంది .  ఆ తరువాత ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలయ్యింది .  'ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ ను కర్ణాటక లోని కుద్రేముఖ్ లో చెయ్యాలని నిర్ణయించామని , అక్కడకి జర్నలిస్టులను తీసుకెళ్లే  బాధ్యతను మీకు అప్పకిస్తున్నామని' ఒక రోజు నాగేశ్వర రావు గారు చెప్పారు .  నాగార్జున మొదటి సినిమా కాబట్టి కవరేజ్ కోసం హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను తీసుకెడితే స్పెషల్ కవరేజ్ వస్తుంది అని చెప్పాను .  అందుకు నాగేశ్వర రావు  గారు కూడా 'అవును , అదే మా ఉద్దేశ్యం, మీకు అన్ని ఏర్పాట్లు చెయ్యమని వెంకట్ కు చెబుతాను  ' అన్నారు .  నేను సరేనన్నాను .  ఆలా జ్యోతి చిత్ర తరుపున నేను ,  సితార నుంచి  గౌస్ ( శాతవాహన ), చిత్ర భూమి నుంచి  కేశవరావు , ఆంధ్ర పత్రిక నుంచి  రాజేశ్వర రావు , ఆం...
చిత్రం
  40 ఏళ్ల నాటి నాగార్జున  'విక్రమ్'  అక్కినేని నాగార్జున నటించిన 'విక్రమ్ ' సినిమా విడుదలై ఈరోజుకు (23 మే 986) 40 సంవత్సరాలు.  నాగార్జున సినిమా జీవితం ప్రారంభించి అప్పుడే నాలుగు దశాబ్దాలు అవుతుందా? కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది ?  1979 ఫిబ్రవరిలో  నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక లో  రిపోర్టర్ గా చేరాను .  అప్పటి నుంచి నాగేశ్వర రావు గారితో నాకు పరిచయం వుంది .అప్పటి నుంచి తరచుగా వారిని కలుస్తూ ఉండేవాడిని.  1984లో నాగేశ్వర రావు గారు నటుడుగా 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక రోజు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు . అప్పుడు నాగేశ్వర రావు గారు బంజారా హిల్స్ లో ఉండేవారు . నేను వెళ్లిన తరువాత  హాల్ లోని రమ్మన్నారు .  సాయంత్రం వేళ నేను వెడితే వారితో హాల్ లోనే కూర్చునేవాడిని . తన 40 సంవత్సరాల సినిమా జీవితం గురించి ఒక ఆర్టికల్ కావాలని నన్ను అడిగారు . '40 సంవత్సరాల మీ సినిమా జీవితం గురించి నేనా ? అన్నాను' ఆశ్చర్యంగా .  'మీరు రాయగలరు . నేను మద్రాసులో వున్నప్పుడు నా ఆలోచనలకు దగ్గరగా ముళ్ళపూడి వెంకట రమణ గారు ...
చిత్రం
  స్మృతి పథంలో రామోజీ రావు గారు  తెలుగు నాటి నిత్యం వినిపించే పేరు రామోజీ రావు . రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ప్రారంభమై వ్యవస్థగా ఎదిగారు .  1974లో ఈనాడు ప్రారంభించి, తెలుగు పత్రిక రంగాన్ని శాసించిన రామోజీ రావు గారు , 1984లో  ఉషాకిరణ్ మూవీస్ ప్రారంభించి తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేశారు . 1995లో ఈటీవీ తో తెలుగు వార్తా ప్రపంచంలో ఒక సంచలనం కలిగించారు .   1996లో తన పేరుతో ఏర్పాటు చేసిన ఫిలింసిటీ ఒక అద్భుతం . దేశానికే గర్వకారణం . 2005లో ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో గా రామోజీ ఫిలింసిటీ  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది .  1984లో రామోజీ రావు గారిని మా జ్యోతి చిత్ర (ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక ) కోసం ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నందమూరి  తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నారు . ఆ ఇంటర్వ్యూ లో తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచు హైద్రాబాద్ కు తరలి రావాలంటే ప్రభుత్వం ఏమి చెయ్యాలి .. అనేది ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది .  అప్పటి నుంచి వారు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవారు .  1987లో జరిగిన మా వివాహ...
చిత్రం
  స్టాలిన్ తో రజనీకాంత్ సమావేశం అందుకేనా ? తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు . విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ కలసి తనకు కాంగ్రెస్ పార్టీ తో 112 మంది మద్దతు ఉందని , ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేశాడు . అయితే ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి 118 మంది శాసన సభ్యులు అవసరమని గవర్నర్ స్పష్టం చేశాడు . గురువారం చెన్నై లోని నెహ్రు స్టేడియం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో గవర్నర్  ఎలా చెప్ప్పడం విజయ్ కు మింగుడుపడలేదు . ఎన్నికల్లో నెగ్గిన పార్టీల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని  గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని ఆహ్వానించడం ఆనవాయితీ . అదే పద్దతిని గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ అనుసరిస్తాడని విజయ్ నమ్మాడు . విజయ్ కు కాంగ్రెస్ పార్టీ  మద్దతు ఇస్తామని అధికారికంగా ప్రకటించడం , లేఖ ఇవ్వడం తో గవర్నర్ మాట మార్చి వుండవచ్చున్నాని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .  సుబ్రహ్మణ్య స్వామి లాటి రాజ్యాంగ నిపుణులు కూడా గవర్నర్ చర్య ను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా తమిళ సూపర్ స్టార్...
చిత్రం
          నేడు దాసరి నారాయణ రావుగారి  84వ జయంతి.  తెలుగు సినిమా రంగంలో ఏకైక దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు .  1972లో 'తాతా మనవడు ' సినిమాతో దర్శకుడుగా  ప్రారంభమైన ఆయన జీవితం 2014 'ఎర్ర బస్సు ' వరకు అప్రతిహతంగా సాగింది . తెలుగు ,హిందీ భాషల్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు . 50 పైగా సినిమాలను నిర్మించారు .  వ్యక్తిగా మొదలైన ఆయన వ్యవస్థగా ఎదిగారు . ఎవరికీ ఈ అవసరం వున్నా నేనున్నా అని భరోసా ఇచ్చారు . సినిమా రంగంలోనే కాకుండా 'ఉదయం ' పత్రికను ప్రారంభించి జర్నలిజం లో సంచలనం సృష్టించారు .  రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు .  దాసరి ఎంత ఎదిగినా అహం రాలేదు కానీ ఆత్మాభిమానం మాత్రం ఆయన వెన్నంటే ఉండేది .  మంచితనం , మనిషితనం  ఆయన సహజ లక్షణాలు .  దాసరి నారాయణ రావు గారు లేని లోటు తెలుగు సినిమా రంగంలో ఎప్పటికీ భర్తీ కాదు . తెలుగు సినిమాలో దాసరి ఒక్కడే ... ఆయనకు సాటి మరొకరు లేరు , రారు .   దాసరి నారాయణ రావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి .  దాసరి అందరివాడు . అందరికీ అందుబాటులో ఉండేవాడు , ఆత...