"మానవత"కు 46 సంవత్సరాలు
నేను రచించిన కవితా సంపుటి "మానవత "కు 46సంవత్సరాలు అయ్యిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది .
అప్పుడే ఇన్ని సవత్సరాలు గడిచిపోయాయి?
"మానవత" నా తొలి పుస్తకం . దీనికి మహాకవి శ్రీ శ్రీ ముందుమాట వ్రాసి , స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు .
నా సాహిత్య జీవితానికి 'మానవత ' నాంది పలికింది .
1980 జూన్ 1వ తేదీన ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంధాలయ సంస్థలో 'మానవత ' పుస్తకావిష్కరణ సభను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రఘురామ్ ఏర్పాటు చేశారు . నాటి సభలో ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు గారు , నిర్మాత దర్శకులు యు .విశేశ్వర రావు గారు , సీనియర్ జర్నలిస్ట్ శ్రీ జి. ఎస్. వరదాచారి, గురువు శ్రీ ఆచార్య తిరుమల , హై కోర్టు లాయర్ శ్రీ అడుసుమిల్లి పాండురంగారావు గారు పాల్గొన్నారు.
ఇదొక మర్చిపోలేని మధుర జ్ఞాపకం .
'ఈ భగీరథ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందిస్తారు , ముందుగా నాకా అవకాశం వచ్చింది ' అని మహాకవి శ్రీ శ్రీ పేర్కొన్నారు .
ఈ సభలో నిర్మాత దర్శకుడు పి .పుల్లయ్య పాల్గొని "ఒరే అబ్బాయి నీకు గొప్ప భవిష్యత్తు ఉందిరా ... మహాకవి ఆశీస్సులు లభించాయి' అని దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు .
అది చూసి మా అన్నయ్య కోటేశ్వర రావు కళ్ళలో ఆనంద బాష్పాలు .
ఆచార్య తిరుమల నాకు ఇంటర్మీడియేటలో గురువు . ఆయన "గురులకు శిష్యులు పుత్రులు - లోక పరమార్థమేది? పుత్రాదిచ్చేత్ పరాజయం". అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది . అది ఆయన సంస్కారం .
'మానవత' నా సాహిత్య జీవితాన్ని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు .



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి