పోస్ట్‌లు

ఏప్రిల్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
  ఈరోజు మహాకవి శ్రీ శ్రీ 116వ జయంతి. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీ శ్రీ తో నా సాహిత్య జీవితం మొదలైంది . 1980 జూన్ 1వ తేదీన నేను రచించిన 'మావవత' అనే కవితా సంపుటికి శ్రీ శ్రీ ముందు మాటను వ్రాసి స్వయంగా  ఆవిష్కరించారు . 46 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని  అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని కిన్నెర రఘురాం ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు అధ్యక్షత వహించారు . నిర్మాత దర్శకుడు ఉప్పలపాటి విశ్వేశ్వర రావు ముఖ్య అతిధిగా వచ్చారు .  సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ .వరదాచారి , మా గురువు ఆచార్య తిరుమల అతిధులుగా పాల్గొన్నారు . సీనియర్ న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారికి 'మానవత ' పుస్తకాన్ని అంకితం ఇచ్చాను . ఆ నాటి సభలో నిర్మాత, దర్శకులు పి .పుల్లయ్య , ఆవుల మంజులత , పంపిణీదారు వెంకట రావు , జర్నలిస్ట్ ఉడయవర్లు, నటి కృష్ణవేణి , మా సోదరుడు కోటేశ్వర రావు , మిత్రుడు ఎన్ .వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు .  నా జీవితంలో అదోగ మధురమైన జ్ఞాపకం .  
చిత్రం
  హైదరాబాద్ సినిమాకు మార్గదర్శకుడు  - దుక్కిపాటి మధుసూదన రావు  సినిమా నిర్మాత అంటే ...? కేవలం డబ్బు పెట్టేవాడు కాదు . సినిమా రంగం , ఆ రంగంలోని అన్ని శాఖల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు . కథ , కథనం , మాటలు , పాటలు , సంగీతం , నటీనటులు , సాంకేతిక నిపుణులు , సినిమా చిత్రీకరణకు అనువైన స్థలాల ఎంపిక , నిర్మాణం , సినిమా ప్రచారం , పంపిణీ, ఇవ్వన్నీ సంపూర్ణంగా తెలిసినవాడే అసలైన చిత్ర నిర్మాత. అలాంటివారిలో నిస్సందేహంగా దుక్కిపాటి మధుసూనరావు గారు మొదటి వరుసలో వుంటారు.   మధుసూదనరావు గారు అనుభవం, అభిరుచి కల నిర్మాత. సమాజానికి సందేశాత్మ చిత్రాలను అందించాలనే స్పృహ వున్న మంచి మనిషి .   అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదన రావు గారు హైదరాబాద్ చలన చిత్ర అభివృద్ధిలో నిర్వహించిన పాత్ర అపూర్వం , అనితర సాధ్యం. అక్కినేని నాగేశ్వర రావు సినిమా జీవితాన్ని తీర్చిదిద్దింది  దుక్కిపాటి మధుసూదన రావు గారే. అక్కినేని కోసం ఆయన సినిమా  రంగానికి వచ్చారు , అక్కినేని కోసమే చిత్ర నిర్మాణం మొదలు పెట్టారు . ఆయనతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశారు . దుక్కిపాటి మధుసూదన రా...
చిత్రం
  చంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు  నవ్యాంధ్ర నిర్మాత , అమరావతి నగర స్వాప్నికుడు  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి 76వ  జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి ఆనందకరమైన  వేడుకలు మరెన్నో చేసుకోవాలి , తెలుగువారి కీర్తిని మరింత విశ్వ వ్యాప్తం చెయ్యాలి .   
చిత్రం
  "తెలుగు సినిమా రంగాన్ని మద్రాస్ నుంచి తరలిస్తాను " - సినిమాటోగ్రఫీ మంత్రి చంద్ర బాబు . ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు .  ఈ సందర్భంగా బాబు గారికి సంబంధించిన 45 సంవత్సరాలనాటి అరుదైన, ఆసక్తిని కలిగించే  సంఘటన ఈతరం పాఠకుల కోసం .      1978లో నారా చంద్ర బాబు నాయుడు చంద్రగిరి శాసన సభా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు .  1980లో ముఖ్యమంత్రి  టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య , సినిమాటోగ్రఫీ మంత్రిగా  ఎంపికయ్యారు .  హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇంకా పూర్తిగా స్థిరపడలేదు . మద్రాసు నుంచి హైద్రాబద్ కు సినిమాను తరలించడాన్ని ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తుంది . హైద్రాబాద్ లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఉంది . ఇది సినిమా జర్నలిస్టులు  ఏర్పాటుచేసుకున్న సంస్థ.  అప్పుడు ఆంధ్ర భూమి లో న్యూస్ ఎడిటర్ గా పనిచేసే జి .ఎస్ .వరదాచారి గారు అధ్యక్షులుగా , ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే సినిమా  వార పత్రిక జ్యోతి చిత్ర లో రిపోర్టర్ గా పనిచేసే నేను కార్యదర్శి...
చిత్రం
   "మీర్జాపురంరాణి -కృష్ణవేణి " బహుకరణ  ఈరోజు ఆత్మీయులు డాక్టర్ కె. వి. రమణాచారి గారిని వారి నివాసంలో కలసి "మీర్జాపురంరాణి - కృష్ణవేణి"  పుస్తకాన్నిబహుకరించాను.  “2004లో డాక్టర్ వై .ఎస్ . రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు,  కృష్ణవేణమ్మ రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేశాము. అప్పుడు నేను సమాచార శాఖ కమీషనర్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎం.డిగా ఉన్నాను”.  రమణాచారి గారు గుర్తు చేశారు. “అవును ఆ విషయం కూడా ఈ పుస్తకంలో రాశాను” అని వారితో చెప్పాను. "ఇన్నాళ్లకు కృష్ణవేణమ్మ జీవిత చరిత్ర రాసినందుకు భగీరథా నిన్ను  అభినందిస్తున్నా , నువ్వు ఏ పుస్తకం వ్రాసిన మనసు పెట్టి రాస్తావు , ముఖ్యంగా నీ శైలి భిన్నంగా , ఆసక్తిగా ఉంటుంది " అని రమణాచారి గారు అభినందించారు . చాలాకాలం తరువాత రమణాచారి గారిని కలుసుకున్నా , చాలా ఆత్మీయంగా మాట్లాడారు . 
చిత్రం
    "మీర్జాపురంరాణి -కృష్ణవేణి "  ఈరోజు సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ వెల్దండ నిత్యానంద రావు గారిని కలసి  నేను రచించిన "మీర్జాపురంరాణి -కృష్ణవేణి " పుస్తకాన్ని బహుకరించాను . మహానటుడు ఎన్ .టి. రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను రాసినందుకు నిత్యానంద రావు గారు ఈ సందర్భంగా అభినందించారు .  "ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువుతాను , మీరు ఏ పుస్తకం తీసుకొచ్చినా , దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది.   "మీరు రామారావు గారి గురించి తీసుకొచ్చిన పుస్తకాన్నినేను అప్పుడప్పుడు చదువుతూ వుంటాను " అని వారు చెప్పారు .  గతంలో నేను సంపాదకత్వం వహించిన "తారకరామం " గ్రంధాన్ని వారికి బహుకరించాను. దానిని గురించి వారు ప్రస్తావించడం  ఎంతో సంతోషం కలిగింది .  ఈ సందర్భంగా నిత్యానంద రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశాను . 
చిత్రం
  "మీర్జాపురంరాణి - కృష్ణవేణి  ఈ తరానికి స్ఫూర్తి "                                            - వెంకయ్య నాయుడు  అలనాటి నటి , గాయని , నిర్మాత కృష్ణవేణమ్మ  జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో  సంతోషంగా ఉందని , ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు . 'మీర్జాపురంరాణి -కృష్ణవేణి ' పుస్తకాన్ని రచయిత భగీరథ , నిర్మాత ఎన్ .ఆర్. అనురాధాదేవి వెంకయ్య నాయుడు గారికి బహుకరించారు .  ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ... 'తెలుగు సినిమా ప్రారంభ రోజుల్లో బాల నటిగా ప్రవేశించి , కథానాయికగా ఎదిగిన కృష్ణవేణమ్మ  గారు మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగిందని' చెప్పారు . కృష్ణవేణమ్మ గారు కేవలం నటి , గాయనిగానే కాదు అభిరుచి కలిగిన నిర్మాత , ఎన్నో సందేశాత్మక సినిమాలను రూపొందించారు .  ముఖ్యంగా ఎన్ .టి . రామారావు గారిని 'మనదేశం 'సినిమాతో పరిచయం చేశారు .  అంద...
చిత్రం
  ఈరోజు ఈనాడు దిన పత్రిక ఆదివారం అనుబంధం లో  "మీర్జాపురంరాణి -కృష్ణవేణి " పుస్తకం గురించి వచ్చిన సమీక్ష . ప్రచురించిన సంపాదకులకు  కృతజ్ఞతలు . రచన : భగీరథ ,పేజీలు : 516, వెల రూ  :750 ప్రతులకు – శ్రుతి  బిజినెస్ సెంటర్ - 040- 23555617, అచ్చంగా తెలుగు 85588 99478.  మరియు నవోదయ  బుక్ హౌస్ : 92474 71361.
చిత్రం
  ఈరోజు లీడర్  దిన పత్రిక లో  "మీర్జాపురంరాణి -కృష్ణవేణి "  పుస్తకం గురించి వచ్చిన సమీక్ష . ప్రచురించిన సంపాదకులు రమణ మూర్తి గారికి   కృతజ్ఞతలు . 
చిత్రం
           భగీరథ ప్రయత్నం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి" భగీరథ తాజా పుస్తకం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి " చదివాను . ఇది అలనాటి నటీమణి కృష్ణవేణి గారి జీవిత చరిత్ర . జీవిత చరిత్రలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి . అయితే జీవిత చరిత్ర అనగానే ఆయా వ్యక్తుల జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని మాత్రమే రచయితు రాస్తుంటారు . ఇందులో ఆయా కాలానికి సంబంధించిన విషయాలు , సంఘటనలు బహు అరుదుగా కనిపిస్తాయి . రచయితలు కేవలం ఆయా  వ్యక్తుల మీదనే ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరిస్తారు . మిగతావి పట్టించుకోరు .  "మీర్జాపురం రాణి - కృష్ణవేణి ' ఈ ధోరణికి భిన్నంగా , సరికొత్తగా , ఆయా కాలంలో జరిగిన సంఘటనలు , ఆ వ్యక్తి పై ప్రభావం చూపించిన  వ్యక్తులు , ఆ ఘటనల పూర్వాపరాలను సరళమైన భాషలో వివరించడం దీని ప్రత్యేకత. అందువల్లనే ఈ రచనకు పరిపూర్ణత వచ్చింది .  భగీరథ ఇంతకు ముందు వ్రాసిన చారిత్రిక నవల "నాగలాదేవి "  తెలుగు నవలా సాహిత్యంలో ఓ ట్రెండ్ సెట్టర్ . ఎందుకంటే ఈ నవలలో  రచయిత ఓ గొప్ప ప్రయోగం చేశారు . శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలను , నాగలాదేవి జీవితానికి...
చిత్రం
                 "బడుగు బలహీన వర్గాల కోసమే  తెలుగు దేశం "                                                          - ఎన్ .టి  రామారావు  1982 ఏప్రిల్ 1 వ తేదీ గురువారం నాడు  2. 30 గంటలకు రామారావు గారితో రామకృష్ణ స్టూడియోస్  లోని  వారి కార్యాలయంలో నేను చేసిన అరుదైన ఇంటర్వ్యూ . .                                  *                     *                      *                             *                            * తెలుగుదేశం గట్టి ప్రతి ప...
చిత్రం
  మీర్జాపురం రాణి కృష్ణవేణి’  ఈ చరిత్ర అపురూపం   సీనియర్  జర్నలిస్టు- ప్రముఖ రచయిత భగీరథ గారు  పుస్తకం తీసుకొస్తున్నారని తెలియగానే ఆనందపడ్డాను.  కానీ 516 పేజీల పుస్తకం అంటే ... ! చాలా ఆశ్చర్యపోయాను.  ఇది ఆమె  ఆత్మకథా?  లేక ఆమె  ఇంటర్వ్యూలు, ఆమె గురించి వాళ్లు వీళ్లు రాసిన వ్యాసాల సంకలనమా?  ఆ ఆత్రంతోనే పుస్తకం వచ్చి రాగానే టకటకా తిరగేసేశాను.  నాలో ముందు రేగిన రెండు సందేహాలూ తప్పే.  ఇది కృష్ణవేణి గారి ఆత్మ కథ కాదు. వ్యాసాల సంకలనం అంతకంటే కాదు. చూస్తుంటే నవలలా అనిపించింది. చదవడం మొదలు పెట్టాను.  అసలు ఎత్తుగడే ఆసక్తికరంగా అనిపించింది.  1936 జనవరి నెలలో రాజమండ్రిలో ఓ సాయంత్రం పూట శివుడి గుడిలో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటక ప్రదర్శనతో ఈ పుస్తకం మొదలవుతుంది.  ఆ నాటికలో సత్యభామ పాత్ర ధరించిన ఓ అమ్మాయిని మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ వ్యక్తి గమనించడంతో అసలు కథ మొదలవుతుంది.  ఆ అమ్మాయి మన కథానాయిక కృష్ణవేణి.  ఆ వచ్చినతను రేలంగి వెంకట్రామయ్య .  ఇక్కడ్నుంచీ కృష్ణవేణి సినిమాల్లోకి ఎలా వెళ్లారు, ఎన్ని ...
చిత్రం
  మీర్జాపురం రాణి కృష్ణవేణి’  ఈ చరిత్ర అపురూపం   సీనియర్  జర్నలిస్టు- ప్రముఖ రచయిత భగీరథ గారు  పుస్తకం తీసుకొస్తున్నారని తెలియగానే ఆనందపడ్డాను.  కానీ 516 పేజీల పుస్తకం అంటే ... ! చాలా ఆశ్చర్యపోయాను.  ఇది ఆమె  ఆత్మకథా?  లేక ఆమె  ఇంటర్వ్యూలు, ఆమె గురించి వాళ్లు వీళ్లు రాసిన వ్యాసాల సంకలనమా?  ఆ ఆత్రంతోనే పుస్తకం వచ్చి రాగానే టకటకా తిరగేసేశాను.  నాలో ముందు రేగిన రెండు సందేహాలూ తప్పే.  ఇది కృష్ణవేణి గారి ఆత్మ కథ కాదు. వ్యాసాల సంకలనం అంతకంటే కాదు. చూస్తుంటే నవలలా అనిపించింది. చదవడం మొదలు పెట్టాను.  అసలు ఎత్తుగడే ఆసక్తికరంగా అనిపించింది.  1936 జనవరి నెలలో రాజమండ్రిలో ఓ సాయంత్రం పూట శివుడి గుడిలో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటక ప్రదర్శనతో ఈ పుస్తకం మొదలవుతుంది.  ఆ నాటికలో సత్యభామ పాత్ర ధరించిన ఓ అమ్మాయిని మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ వ్యక్తి గమనించడంతో అసలు కథ మొదలవుతుంది.  ఆ అమ్మాయి మన కథానాయిక కృష్ణవేణి.  ఆ వచ్చినతను రేలంగి వెంకట్రామయ్య .  ఇక్కడ్నుంచీ కృష్ణవేణి సినిమాల్లోకి ఎలా వెళ్లారు, ఎన్ని ...
చిత్రం
మీర్జాపురం రాణి కృష్ణవేణి - సినిమా రంగంలో ఆణిముత్యం మనకు పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి చరిత్రకు సృజనాత్మక కథనానికి మధ్య వారధిగా నిలుస్తాయి. ఆ చారిత్రక గతాన్ని సజీవంగా పాఠకుల ముందు నిలిపి మనకు కచ్చితమైన అనుభవాన్నిస్తుంది . పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు, ప్రాథమిక చరిత్ర ఆధారాలు, శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు , అనుభవజ్ఞుల నుండి గ్రహించిన విషయాల ఆధారంగా కథనాలను రూపొందించడం జరుగుతుంది . ఈ నవలలు పాఠకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లి, వారిలో నమ్మకాన్ని పెంచి, స్పష్టమైన చారిత్రక విషయాలను సజీవంగా మనకు అందిస్తాయి. అంతే కాకుండా చరిత్రలో వదిలివేసిన ఖాళీలను సైతం పూరిస్తాయి. మరుగున పడిపోయిన అనేక చారిత్రాత్మక సంఘటనలను,ఆయా కాలాలలోని ప్రజల జీవన విధానం ఈ తరం పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చేసే గొప్ప ప్రయత్నం. అలాంటి పరిశోధన ఆధారిత నవలలు రాసిన ఘనత భగీరథ గారిది . వారు రచించిన ‘నాగలాదేవి, ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి ’.ఈ కోవకు చెందుతాయి . గత 18 ఏండ్లుగా భగీరథ గారు చారిత్రక పరిశోదనకు అంకితమై కాకతీయ , విజయనగర సామ్రాజ్యాల గురించి విస్తృతమైన పరిశోధన చేశారు . ఆ పరిశ...