ఈరోజు మహాకవి శ్రీ శ్రీ 116వ జయంతి.

శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీ శ్రీ తో నా సాహిత్య జీవితం మొదలైంది .

1980 జూన్ 1వ తేదీన నేను రచించిన 'మావవత' అనే కవితా సంపుటికి శ్రీ శ్రీ ముందు మాటను వ్రాసి స్వయంగా  ఆవిష్కరించారు .


46 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని  అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని కిన్నెర రఘురాం ఏర్పాటు చేశారు .

ఈ కార్యక్రమానికి అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు అధ్యక్షత వహించారు .

నిర్మాత దర్శకుడు ఉప్పలపాటి విశ్వేశ్వర రావు ముఖ్య అతిధిగా వచ్చారు . 


సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ .వరదాచారి , మా గురువు ఆచార్య తిరుమల అతిధులుగా పాల్గొన్నారు .

సీనియర్ న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారికి 'మానవత ' పుస్తకాన్ని అంకితం ఇచ్చాను .



ఆ నాటి సభలో నిర్మాత, దర్శకులు పి .పుల్లయ్య , ఆవుల మంజులత , పంపిణీదారు వెంకట రావు , జర్నలిస్ట్ ఉడయవర్లు, నటి కృష్ణవేణి , మా సోదరుడు కోటేశ్వర రావు , మిత్రుడు ఎన్ .వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు . 


నా జీవితంలో అదోగ మధురమైన జ్ఞాపకం .  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు