"మీర్జాపురంరాణి -కృష్ణవేణి "
ఈరోజు సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ వెల్దండ నిత్యానంద రావు గారిని కలసి
నేను రచించిన "మీర్జాపురంరాణి -కృష్ణవేణి " పుస్తకాన్ని బహుకరించాను .
మహానటుడు ఎన్ .టి. రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను రాసినందుకు నిత్యానంద రావు గారు ఈ సందర్భంగా అభినందించారు .
"ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువుతాను , మీరు ఏ పుస్తకం తీసుకొచ్చినా , దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది.
"మీరు రామారావు గారి గురించి తీసుకొచ్చిన పుస్తకాన్నినేను అప్పుడప్పుడు చదువుతూ వుంటాను " అని వారు చెప్పారు .
గతంలో నేను సంపాదకత్వం వహించిన "తారకరామం " గ్రంధాన్ని వారికి బహుకరించాను. దానిని గురించి వారు ప్రస్తావించడం
ఎంతో సంతోషం కలిగింది .
ఈ సందర్భంగా నిత్యానంద రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశాను .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి