"మీర్జాపురంరాణి - కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి "
- వెంకయ్య నాయుడు
అలనాటి నటి , గాయని , నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని , ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .
'మీర్జాపురంరాణి -కృష్ణవేణి ' పుస్తకాన్ని రచయిత భగీరథ , నిర్మాత ఎన్ .ఆర్. అనురాధాదేవి వెంకయ్య నాయుడు గారికి బహుకరించారు .
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ... 'తెలుగు సినిమా ప్రారంభ రోజుల్లో బాల నటిగా ప్రవేశించి , కథానాయికగా ఎదిగిన కృష్ణవేణమ్మ గారు మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగిందని' చెప్పారు .
కృష్ణవేణమ్మ గారు కేవలం నటి , గాయనిగానే కాదు అభిరుచి కలిగిన నిర్మాత , ఎన్నో సందేశాత్మక సినిమాలను రూపొందించారు .
ముఖ్యంగా ఎన్ .టి . రామారావు గారిని 'మనదేశం 'సినిమాతో పరిచయం చేశారు . అందుకే ఆమె అంటే తనకు గౌరవమని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. అక్కినేని నాగేశ్వర రావు ,అంజలీదేవి , ఎస్ .వి .రంగారావు , రేలంగి వెంకట్రామయ్య , సిహెచ్ .నారాయణ రావు , ఘంటసాల , రమేష్ నాయుడు , త్రిపురనేని గోపీచంద్ , తాపీ ధర్మారావు , చిత్రపు నారాయణ మూర్తి లాంటి వారికి చేయూత నిచ్చిన కృష్ణవేణమ్మ చిరస్మరణీయురాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .
విజయవాడలో 2024 డిసెంబర్14న 'మనదేశం' సినిమా వజ్రోత్సవ వేడుకలు , 'తారకరామం' పుస్తకావిష్కరణ సభలో , తాను , ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కలసి కృష్ణవేణమ్మను సత్కరించామని, ఆనాడు ఆమె కళ్ళలో ఆనందభాష్పాలు చూశానని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు .
"మీర్జాపురంరాణి -కృష్ణవేణి " పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను, నిర్మాత ఎన్ .ఆర్ .అనురాధాదేవి ని వెంకయ్య నాయుడు అభినందించారు .
అలనాటి నటి , గాయని , నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని , ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి