"మీర్జాపురంరాణి -కృష్ణవేణి " బహుకరణ 

ఈరోజు ఆత్మీయులు డాక్టర్ కె. వి. రమణాచారి గారిని వారి నివాసంలో కలసి "మీర్జాపురంరాణి - కృష్ణవేణి"  పుస్తకాన్నిబహుకరించాను.

 “2004లో డాక్టర్ వై .ఎస్ . రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు,  కృష్ణవేణమ్మ రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేశాము. అప్పుడు నేను సమాచార శాఖ కమీషనర్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎం.డిగా ఉన్నాను”.  రమణాచారి గారు గుర్తు చేశారు.


“అవును ఆ విషయం కూడా ఈ పుస్తకంలో రాశాను” అని వారితో చెప్పాను.

"ఇన్నాళ్లకు కృష్ణవేణమ్మ జీవిత చరిత్ర రాసినందుకు భగీరథా నిన్ను  అభినందిస్తున్నా , నువ్వు ఏ పుస్తకం వ్రాసిన మనసు పెట్టి రాస్తావు ,

ముఖ్యంగా నీ శైలి భిన్నంగా , ఆసక్తిగా ఉంటుంది " అని రమణాచారి గారు అభినందించారు .

చాలాకాలం తరువాత రమణాచారి గారిని కలుసుకున్నా , చాలా ఆత్మీయంగా మాట్లాడారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు