మీర్జాపురం రాణి కృష్ణవేణి - సినిమా రంగంలో ఆణిముత్యం
మనకు పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి చరిత్రకు సృజనాత్మక కథనానికి మధ్య వారధిగా నిలుస్తాయి. ఆ చారిత్రక గతాన్ని సజీవంగా పాఠకుల ముందు నిలిపి మనకు కచ్చితమైన అనుభవాన్నిస్తుంది . పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు, ప్రాథమిక చరిత్ర ఆధారాలు, శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు , అనుభవజ్ఞుల నుండి
గ్రహించిన విషయాల ఆధారంగా కథనాలను రూపొందించడం జరుగుతుంది . ఈ నవలలు పాఠకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లి, వారిలో నమ్మకాన్ని పెంచి, స్పష్టమైన చారిత్రక విషయాలను సజీవంగా మనకు అందిస్తాయి. అంతే కాకుండా చరిత్రలో వదిలివేసిన ఖాళీలను సైతం పూరిస్తాయి. మరుగున పడిపోయిన అనేక చారిత్రాత్మక సంఘటనలను,ఆయా కాలాలలోని ప్రజల జీవన విధానం
ఈ తరం పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చేసే గొప్ప ప్రయత్నం.
అలాంటి పరిశోధన ఆధారిత నవలలు రాసిన ఘనత భగీరథ గారిది .
వారు రచించిన ‘నాగలాదేవి, ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి ’.ఈ కోవకు చెందుతాయి .
గత 18 ఏండ్లుగా భగీరథ గారు చారిత్రక పరిశోదనకు అంకితమై కాకతీయ , విజయనగర సామ్రాజ్యాల గురించి విస్తృతమైన పరిశోధన చేశారు . ఆ పరిశోధనల ఫలితమే “ నాగలాదేవి”( శ్రీకృష్ణదేవరాయలు ప్రేమ కథ), ఇప్పుడు 'మీర్జాపురంరాణి -కృష్ణవేణి ' పుస్తకం నందమూరి తారకరామా రావు గారిని 'మనదేశం' సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయం చేసిన నటీమణి కృష్ణవేణి .
“మీర్జాపూరం రాణి కకృష్ణవేణి “జీవిత చరిత్ర ఓ అద్భుతమైన , ఆసక్తిని కలిగించే కథ .
పన్నెండేళ్ల లేత వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్న యర్రంశెట్టి కృష్ణవేణి రమణీయ గాథ ఈ జీవిత చరిత్ర . తనను 1936లో సినిమా రంగానికి 'సతీఅనసూయ ' సినిమా ద్వారా పరిచయం చేసిన చిత్తజల్లు పుల్లయ్య , ఆయన శ్రీమతి రంగమ్మ ను తన ఆత్మీయులుగా , తల్లిదండ్రిగా భావించి , వారి ఇంటి మీరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న మానవతా మూర్తి కృష్ణవేణి . అందం,అభినయం,వినయం,ఆత్మగౌరవం,సేవాగుణం కలిగిన నిండైన వ్యక్తిత్వం కృష్ణవేణి సొంతం.“మహానంద ‘అనే చిత్రంలో కళావతి నటన మీర్జాపురం రాజా వెంకట్రామయ్య అప్పారావు ను ఆకర్షించింది.తరువాత ఆమెను వివాహ మాడారు. మీర్జాపూర్ రాజాతో కృష్ణవేణి వివాహం అనుహ్యమైనది . అక్కడ నుంచి ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది .
గొల్లభామ, కీలు గుఱ్ఱం, లక్ష్మమ్మ , మన దేశం చిత్రాలు నిర్మించారు.వీరి సొంత స్టూడియో ‘శోభనాచల స్టూడియోస్ బానర్ “ పై పది చిత్రాలను నిర్మించారు .
ఆమె జీవిత చరిత్రను కూతురు శ్రీమతి అనూరాధ గారి సహాయంతో అరుదైన ఫోటోలతో సమాచారాన్ని సేకరించి 516 పేజీలలో భగీరథ గారు మనకు అందించారు .
కృష్ణవేణి గారు తెలుగు చిత్ర రంగానికి నిస్వార్థంగా గట్టి పునాది వేశారన్న వాస్తవం ఈమే జీవిత చరిత్రలో ప్రస్పుటంగా వివరించారు భగీరథ గారు .
తెలుగు చలన చిత్ర రంగ ప్రముఖులు ఇప్పటి కైనా కృష్ణవేణి సేవలు గుర్తించి మీర్జాపూర్ రాణి కళావతి పేరుతో ఒక పురస్కారాన్ని ప్రవేశపెట్టాలని నేను భావిస్తున్నాను.
చరిత్ర పుటల్లో గడచిన వత్సరాల కాలగర్భంలోంచి మీర్జాపురం రాణి కృష్ణవేణి జీవితాన్ని శ్రమ కోర్చి పరిశోధించి పరిశీలించి వందేండ్ల తెలుగు చలన చిత్ర చరిత్రను ఆమె జీవిత చరిత్ర రూపంలో మన కందించిన భగీరథ గారు ధన్యులు..
భగీరథ గారి నవలలు చదివిన నాకు వీరి జిజ్ఞాస,పరిశోధన , శ్రమ కోర్చి రచించిన చరిత్ర ఆధారిత నవలలు ఒక గౌరవ డాక్టరేట్ కు తీసిపోవనిపించింది.
20 పుస్తకాలు ప్రచురించిన సాహితీ వేత్త, పరిశోధనాత్మక జీవిత చరిత్ర నవలల రచయిత, సీనియర్ జర్నలిస్ట్ .
భగీరథ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
-విశ్వపుత్రిక డా. పి . విజయలక్ష్మి పండిట్
రిటైర్డ్ ప్రొఫెసర్, డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం,
ప్రతులకు : శ్రుతి బిజినెస్ సెంటర్ : 040 23555617

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి