దాసరి నారాయణ రావు గారి సమాధి పట్ల నిర్లక్ష్యం ?
ఈరోజు దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి 9వ వర్ధంతి. ఆయన 30 మే 2017లో తన 75వ సంవత్సరంలో మరణించారు .
దాసరి నారాయణ రావు గారికి వికారాబాద్ కు వెళ్లే దారిలో మొయినాబాద్ దగ్గర ఫామ్‌హౌస్ ఉంది .
అక్కడ దాసరి పద్మ గారి సమాధి కూడా ఉంది .పద్మ గారు అక్టోబర్ 28, 2011లో కన్నుమూశారు.
ఆ సమాధి ప్రక్కనే దాసరి నారాయణ రావు సమాధిని కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు.
అయితే మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్న దాసరి మరియు పద్మ సమాధులు పిచ్చి మొక్కలు , ముళ్ల చెట్లతో దయనీయంగా ఉందనే ఓ వీడియో సోషల్ మీడియా లో ఈరోజు రావడంతో చిత్ర పరిశ్రమ నివ్వెర పోయింది. తెలుగు సినిమాలో అఖండంగా వెలిగిన దాసరి నారాయణ రావు గారికి ఇలాంటి స్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. హైద్రాబాద్ కు దూరంగా ఉండటం , సమాధిని వారి కుటుంబ సభ్యులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారనే ఉద్దేశ్యతో సినిమా రంగం వుంది .
దాసరి నారాయణ రావు గారికి హరి హర ప్రభు, అరుణ్ కుమార్ , హేమాలయా కుమారి, ముగ్గురు సంతానం . దాసరి కుమార్తె హిమాలయ కుమారి అల్లుడు డాక్టర్ రఘునాథ బాబు , వారి ఇద్దరు కుమారులు కూడా సమాధిని తరచూ సందర్శిస్తూనే ఉన్నారు .
దాసరి గారి జయంతి మే 4న, అయితే ఆరోజున ఈ సమాధి దగ్గరకు కుటుంబ సభ్యులు , సినిమా రంగానికి చెందిన వారు ఎవరూ రాలేదని అర్ధమవుతుంది. గత కొంత కాలం నుంచి ఈ సమాధులవైపు ఎవరూ రాలేదని అర్ధమవుతుంది .
దాసరి నారాయణ రావు గారి విగ్రహం ఫిలింనగర్ లో వుంది . ఆయన జయంతి మే 4, వర్ధంతి మే 30, ఈ రెండు రోజుల్లో దాసరి విగ్రహానికి సినిమారంగానికి చెందిన వారు పూల మాలలతో నివాళులు అర్పిస్తారు .
మొయినాబాద్ లో ఆయన ఫామ్‌హౌస్ ఉందని అందరూ మర్చిపోయారు . దాసరి కుటుంబ సభ్యులు , సినిమా రంగం కూడా దాసరి సమాధిని పట్టించుకోకపోవడం మాత్రం క్షంతవ్యం కాదు .
దాసరి సినిమా రంగాన్ని తన కుటుంబంగా భావించాడు , 24 విభాగాల్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఆదుకునే దర్శక రత్నం దాసరి గారు .
మొయినాబాద్ వెళ్లి యుద్ధ ప్రాతిపదికన పరిసరాలను శుభ్రం చేయంచారు .
సినిమా రంగానికి ఎంతో చేసిన దాసరి నారాయణ రావు గారికి భవిష్యత్తులో ఇలాటి స్థితి రాకుండా చూడాల్చిన బాధ్యత తెలుగు సినిమా రంగానిదే. ఎందుకంటే దాసరి ఒక కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదు , సినిమా కుటుంబానికే పెద్ద . సినిమా కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి