నేడు దాసరి నారాయణ రావుగారి  84వ జయంతి. 

తెలుగు సినిమా రంగంలో ఏకైక దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు . 

1972లో 'తాతా మనవడు ' సినిమాతో దర్శకుడుగా  ప్రారంభమైన ఆయన జీవితం 2014 'ఎర్ర బస్సు ' వరకు అప్రతిహతంగా సాగింది .


తెలుగు ,హిందీ భాషల్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు . 50 పైగా సినిమాలను నిర్మించారు . 

వ్యక్తిగా మొదలైన ఆయన వ్యవస్థగా ఎదిగారు . ఎవరికీ ఈ అవసరం వున్నా నేనున్నా అని భరోసా ఇచ్చారు .

సినిమా రంగంలోనే కాకుండా 'ఉదయం ' పత్రికను ప్రారంభించి జర్నలిజం లో సంచలనం సృష్టించారు . 


రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు . 

దాసరి ఎంత ఎదిగినా అహం రాలేదు కానీ ఆత్మాభిమానం మాత్రం ఆయన వెన్నంటే ఉండేది . 

మంచితనం , మనిషితనం  ఆయన సహజ లక్షణాలు . 

దాసరి నారాయణ రావు గారు లేని లోటు తెలుగు సినిమా రంగంలో ఎప్పటికీ భర్తీ కాదు .

తెలుగు సినిమాలో దాసరి ఒక్కడే ... ఆయనకు సాటి మరొకరు లేరు , రారు . 



 దాసరి నారాయణ రావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి . 

దాసరి అందరివాడు . అందరికీ అందుబాటులో ఉండేవాడు , ఆత్మీయతను పంచేవాడు . 

 మే 4, 1942న  పాలకొల్లు లో జన్మించిన దాసరి   తన 75వ ఏట మే 30, 2017న  హైదరాబాద్ లో మరణించారు . 


దాసరి ఎప్పటికీ తెలుగు సినిమాలో స్మరణీయుడే . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు