'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ జ్ఞాపకాలు
నేను రచించిన రెండవ కవితా సంపుటి 'అక్షరాంజలి ' ని అప్పటి మద్రాస్ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు.
2015 జూన్ 1వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో దీనిని ఆవిష్కరించారు .
నా 'మానవత' పుస్తకం కూడా 1980 జూన్ 1వ తేదీనే శ్రీశ్రీ గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు .
అప్పుడు శ్రీ శ్రీ గారు మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు .
అక్షరాంజలి కవితా సంపుటిని కూడా గవర్నర్ రోశయ్య గారు మద్రాసు నుంచి వచ్చి జూన్ 1న ఆవిష్కరించారు .
బహుశ ఇలా జరగడం మాత్రం యాదృచ్చికం కావచ్చు , కానీ నాకు మాత్ర రెండు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి .
అక్షరాంజలి వెలుగు చూడటానికి కారకులు నిర్మాత శ్రీ కళ్యాణ్ గారు . దీనిని డాక్టర్ కె .వి . రమణాచారి గారికి అంకితం చేశాను .
అప్పటి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు .
మా నాగండ్ల ప్రముఖులు శ్రీ చెరుకూరి హరి ప్రసాద్ గారు , శ్రీ పుల్లెల గోపీచంద్ గారు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు .
డాక్టర్ కె .వి .కృష్ణకుమారి , డాక్టర్ శ్రీనివాస రెడ్డి , డాక్టర్ ఉమాపతి వర్మ , శ్రీ శివాజీ రాజా పాల్గొన్నారు.
'అక్షరాంజలి' నాకు ప్రేరణ కలిగించిన ప్రేమ కావ్యం . ఇందులో 30 కవితలు ఉన్నాయి . ఆ కవితలకు అర్ధవంతమైన పెయింటింగ్స్ వున్నాయి . ఈ అక్షరాంజలి కవితా సంపుటి ఎందరికో బాగా నచ్చింది .
ఈ కార్యక్రమాన్ని వంశీ ఆర్ట్ థియేటర్స్ రామరాజు గారు ఏర్పాటుచేశారు .
శైలి అండ్ శైలి క్రియేటివ్ కమ్యూనికేషన్స్ ప్రచురణ సంస్థ తరుపున శ్రుతి నిర్వహించింది .




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి