దర్శకుడు కృష్ణారెడ్డి @ 65
ఈరోజు దర్శకుడు ఎస్ .వి కృష్ణ రెడ్డి గారి 65వ పుట్టిన రోజు .
తెలుగు సినిమా రంగంలో కృష్ణా రెడ్డి గారిది ప్రత్యేకమైన శైలి . అసభ్యత , అశ్లీలత లేకుండా కుటుంబ సమేతంగా చూడతగ్గ 42 ఆరోగ్యకరమైన , వినోదాత్మక చిత్రాలను తెలుగు వారికీ అందించారు . ఆయన తాజా చిత్రం 'వేదవ్యాస్ '.
కృష్ణా రెడ్డి కి చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది . మద్రాసువెళ్లి 'పగడాల పడవ ' అనే చిత్రం లో నటించారు .
కానీ ఆ చిత్రం విడుదల కాలేదు . అదే సమయంలో చిన్ననాటి మిత్రుడు అచ్చి రెడ్డి ఆసరాగా నిలబడ్డారు . ఇద్దరూ హైదరాబాద్ వచ్చి
వ్యాపారం చేస్తూ 1991లో 'కొబ్బరి బొండం 'అనే చిత్రం తో నిర్మాణంలో అడుగు పెట్టారు . ఆ సినిమా విజయవంతమయ్యింది .
1993లో కృష్ణారెడ్డి దర్శకుడుగా 'రాజేంద్రుడు - గజేంద్రుడు ' రూపొందింది . ఆ సినిమా విజయం సాధించింది . ఆ వెంటనే 'మాయలోడు ' సినిమా రూపొందింది . ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది .
ఆ తరువాత నెంబర్ వన్ , యమలీల , శుభ లగ్నం , టాప్ హీరో , వజ్రం , ఘటోత్కచుడు, గన్ షాట్, వినోదం , మావిచిగురు ... ఇలా కృష్ణారెడ్డి విజయ పరంపర మొదలయ్యింది .
కృష్ణారెడ్డి గారికి అన్ని విధాలా , అన్నింటిలోనూ , అన్ని వేళలా , తోడుగా , నీడగా , అండగా అచ్చి రెడ్డి గారు నిలబడ్డారు .
అందుకే వీరిరువురినీ కృష్ణార్జునులు లేదా ప్రాణ స్నేహితులు అంటారు .
మూడున్నర దశాబ్దాల స్నేహం నేటికీ అవిచ్చిన్నంగా, అవిశ్రాంతంగా కొనసాగుతూ ఉంది .
నేడు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ లో 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు బహుకరణ , వేదవ్యాస్ మేకింగ్ వీడియో విడుదల మరియు జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు
కృష్ణారెడ్డి గారు , అచ్చి రెడ్డి గారు నాకు ఎంతో ఆత్మీయులు , నా 'భారతమెరికా' పుస్తకావిష్కరణ లోనూ , అమరావతి డాన్స్ బ్యాలే కార్యక్రమంలోను పాల్గొన్నారు .
కృష్ణారెడ్డి గారు మరిన్ని పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలని , ఆరోగ్యకరమైన చిత్రాలు రూపొందించాలని కోరుకుంటున్నా.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి