పోస్ట్‌లు

అక్టోబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
  సింగీతంతో అరుదైన జ్ఞాపకాలు  సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు శనివారం రోజు ఇహలోక యాత్ర ముగించారని వార్త బాధించింది . శ్రీనివాసరావు గారు సృజనాత్మక శీలి , ప్రతిభావంతమైన దర్శకుడు.  తెలుగు సినిమాలో సింగీతం ఎన్నో ప్రయోగాలు చేశారు . 94 ఏళ్ల వయసులో కూడా ఆయన మెగా ఫోన్ పట్టుకోవడం ఆయనకే సాధ్యం . సింగీతం తో కొన్నాళ్ల పాటు కలసి ప్రయాణించిన రోజులు మనసులో మెదులుతున్నాయి . నేను ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పనిచేసిన 'స్వాగతం 'సినిమాలోని ఒక పాటను హంపిలో చిత్రీకరించాలనుకున్నారు . 2007 నవంబర్ లో కెమెరామన్ రమేష్ , కో డైరెక్టర్ రంగారావు , స్టిల్ ఫోటోగ్రాఫర్ రవీంద్ర బాబు తో కలసి నేను లొకేషన్లు చూడటానికి  మొదటిసారి హంపి వెళ్ళాను . అప్పుడు శిధిలమైన హంపి నగరాన్ని చూసి నా మనసు అమితంగా కలవరపడింది . డిసెంబర్లో జగపతి బాబు , అనుష్క మీద పాట  చిత్రీకరించిన తరువాత హనుమాన్ సింగ్ అనే గైడ్ సహాయంతో హంపి శిధిలాలను చూశాను. హంపి నగరం మౌనంగా రోదించడం నన్ను ఆలోచించేలా చేసింది . విరూపాక్ష దేవాలయంలో వున్న ఓకే పుస్తకాల షాప్ లో 'ఏ ఫర్గాటెన్ ఎంపైర్ ', 'హంపి  రూయిన్స్ ' అనే రెండు పుస్తకాలు కొన...
చిత్రం
  కన్నడ నాగలాదేవి  తెలుగులో నేను రచించిన 'నాగలాదేవి ' నవలను డాక్టర్ దేవన్న కన్నడంలో అనువదించారు . ఈ పుస్తకం 12వ తేదీ  సోమవారం ఉదయం 10 గంటలకు  హంపిలోని విరూపాక్ష దేవాలయంలో ఆవిష్కరణ కార్యక్రమం  ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల వారసులు శ్రీకృష్ణదేవరాయలు గారు , శ్రీమతి లలితారాణి , బళ్లారిలో కృష్ణదేవరాయ  విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్ . మునిరాజ్, ఆర్కియాలజీ సూపరింటెండెంట్ శ్రీ కే. రామకృష్ణా  రెడ్డి , కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నిశితి రుద్రప్ప , కన్నడ  విశ్వవిద్యాలయం రిజిస్టార్ శ్రీ విరూపాక్షి పూజారిహళ్లి , ప్రొఫెసర్ బి .సి . ఐగోల్ ,  శ్రీ భీమినేని భాస్కర్ నాయుడు, శ్రీ గుండి మారుతి  పాల్గొంటున్నారు.  ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగా రూరల్ డెవలప్మెంట్  సొసైటీ వారు ఏర్పాటు చేస్తున్నారు . ఈ సందర్భంగా డాక్టర్ దేవన్న కృషిని అభినందిస్తున్నాను .