మయూర భువనేశ్వరి జ్ఞాపకాలు
నేను 2007లో స్వాగతం సినిమా షూటింగ్ కోసం హంపి వెళ్ళినప్పుడు జగపతి బాబు , అనుష్క , మిగతా యూనిట్ సభ్యులందరూ హోటల్ మయూర భువనేశ్వరిలో బస చేశాము. 19 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ హోటల్ లో భోజనం చెయ్యడానికి దేవన్నగారు , శివ ప్రసాద్ గారితో కలసి వెళ్లడం జరిగింది .
ఈ హోటల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఉదయం వేళ మార్నింగ్ వాక్ చేసేవాడిని . చాలా ప్రశాంతగా ఉండేది .
నేను అప్పుడు 207 గదిలో దిగాను. ఆ గదిని శివ ప్రసాద్ గారికి చూపించాను . ఆ హోటల్ లో ఏమి మారలేదు .
మేము సినిమా యూనిట్ కు బయట నుంచి భోజనం తెప్పించి అక్కడి డైనింగ్ హాల్ లో పెట్టడం జరిగింది. సాధారణంగా బయటి భోజనం అనుమతించరు . అయితే రిసెప్షన్ దగ్గర వున్న పార్వతి అన్న అమ్మాయి మాకు బాగా సహకరించింది. మాకు కావలసిన రూమ్ లను కేటాయించింది . ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసింది. ఇక మాకు హనుమాన్ సింగ్ అనే గైడ్ లొకేషన్లు చూడటానికి , స్థానికులతో సమన్వయం చెయ్యడం , కావలసినవి ఏర్పాటు చెయ్యడం ... అనేక రకాలుగా సహకరించాడు .
అందుకే అతన్ని నాగలాదేవి కన్నడ పుస్తకం ఆవిష్కరణ సభలో సత్కరించాము .
మయూర భువనేశ్వరి రిసెప్షన్ లో దేవన్నగారు , శివ ప్రసాద్ గారితో తీయించుకున్న ఫోటోలు .


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి