సింగీతంతో అరుదైన జ్ఞాపకాలు 

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు శనివారం రోజు ఇహలోక యాత్ర ముగించారని వార్త బాధించింది .

శ్రీనివాసరావు గారు సృజనాత్మక శీలి , ప్రతిభావంతమైన దర్శకుడు.  తెలుగు సినిమాలో సింగీతం ఎన్నో ప్రయోగాలు చేశారు .

94 ఏళ్ల వయసులో కూడా ఆయన మెగా ఫోన్ పట్టుకోవడం ఆయనకే సాధ్యం .

సింగీతం తో కొన్నాళ్ల పాటు కలసి ప్రయాణించిన రోజులు మనసులో మెదులుతున్నాయి .

నేను ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పనిచేసిన 'స్వాగతం 'సినిమాలోని ఒక పాటను హంపిలో చిత్రీకరించాలనుకున్నారు .

2007 నవంబర్ లో కెమెరామన్ రమేష్ , కో డైరెక్టర్ రంగారావు , స్టిల్ ఫోటోగ్రాఫర్ రవీంద్ర బాబు తో కలసి నేను లొకేషన్లు చూడటానికి 

మొదటిసారి హంపి వెళ్ళాను . అప్పుడు శిధిలమైన హంపి నగరాన్ని చూసి నా మనసు అమితంగా కలవరపడింది .

డిసెంబర్లో జగపతి బాబు , అనుష్క మీద పాట  చిత్రీకరించిన తరువాత హనుమాన్ సింగ్ అనే గైడ్ సహాయంతో హంపి శిధిలాలను చూశాను. హంపి నగరం మౌనంగా రోదించడం నన్ను ఆలోచించేలా చేసింది .

విరూపాక్ష దేవాలయంలో వున్న ఓకే పుస్తకాల షాప్ లో 'ఏ ఫర్గాటెన్ ఎంపైర్ ', 'హంపి  రూయిన్స్ ' అనే రెండు పుస్తకాలు కొన్నాను .

2008 జనవరి 25న విడుదలైన తరువాత ఈ రెండు పుస్తకాలను చదవడం మొదలు పెట్టాను .

నా ఆలోచనల్లో పూర్తి మార్పు వచ్చింది . అప్పటి నుంచి, కాకతీయ, విజయనగరం మీద పరిశోధన చెయ్యడం మొదలు పెట్టాను .

ఇందుకోసం ఢిల్లీ, ముంబై, చెన్నై , గోవా తో పాటు హంపి అనేక పర్యాయాలు దర్శించాను .

శ్రీకృష్ణదేవరాయల మీద ఒక స్క్రిప్ట్ తయారు చేశాను . దీని గురించి మాట్లాడటానికి 2011లో నేను , మిత్రుడు రామ్ గోపాల్ చెన్నై వెళ్లి 

సింగీతం గారిని కలిసి కథ వినిపించాను . ఆయనకు బాగా నచ్చింది. వారి ఇంట్లోనే రెండు మూడు రోజులపాటు చర్చింది ఇంగ్లీషులో సినాప్సిస్ తయారు చేశాము . ఆ తరువాత జూన్ లో హంపి వెడదామని నిర్ణయించాము . 

సింగీతం , రామ్ గోపాల్,  రచయిత ఆకెళ్ళ ,సతీష్ , పూర్ణతో నేను హంపి బయలుదేరాం . 

రెండు రోజులపాటు మాతో పాటు సింగీతం గారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు .

మీరు చూస్తున్న ఫోటోలు అప్పటివే. 

సింగీతం గారు ఇక లేరనే మనసును కలవరపెడుతోంది .  




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు