ఆత్మీయతను పంచిన మిత్రుడు భాస్కర నాయుడు
నాగలాదేవి కన్నడ పుస్తక ప్రచురణకు ఆర్ధికంగా సహాయం చేసిన మిత్రుడు భీమినేని భాస్కర నాయుడు.
అంతకు ముందు దేవన్న గారు భాస్కర నాయుడు గారి గురించి చెప్పారు .
భాస్కర నాయుడు గారిది బళ్లారిలో స్థిరపడిన తెలుగు కుటుంబమని, వారికి పరిశ్రమ ఉందని, మనిషి చాలా సౌమ్యుడని దేవన్న నాతో చెప్పారు .
ఈ పుస్తక ఆవిష్కరణ హంపిలోని విరూపాక్ష దేవాలయంలో జరిగినప్పుడు దేవన్న భాస్కర నాయుడును నాకు పరిచయం చేశారు .
భాస్కర నాయుడు ను చూడగానే సదభిప్రాయం కలిగింది. ఆయన కూడా తెలుగు వాడు కావడం మరింత ఆనందదాయకం . ఆరోజు కార్యక్రమంలో పాల్గొన్న భాస్కర నాయుడును మాట్లాడమంటే 'నాకు అలవాటు లేదు సర్ ' అని చెప్పడం ఆయన ఒదిగి వుండే తత్వాన్ని తెలియజేసింది .
అదే రోజు మధ్యాహ్నం 250 మందికి చక్కటి బోజనాలను ఏర్పాటు చేసి అందరి ప్రశంశలు అందుకున్నాడు .
భాస్కర నాయుడు గారి చిత్రాన్ని మిత్రుడు శివ ప్రసాద్ గారు గీసి నాతో బహుకరించారు .
భాస్కర నాయుడు మంచి స్నేహశీలి .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి