సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి
ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి అనే సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు .
రాఘవయ్య చౌదరి , నాగరత్నమ్మ దంపతులకు 1947 మే 31న తెనాలిలో ని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు .
కృష్ణ కు చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది. చదువు పూర్తి అయిన తరువాత మద్రాసు వచ్చాడు .
1962లో వ్. మధుసూదన రావు దర్శకత్వం వహించిన 'పదండి ముందుకు' అనే సినిమాలో చిన్న వేషం వేశారు . ఈ సినిమాను కొంగర జగ్గయ్య నిర్మించి ప్రధాన పాత్రలో నటించారు .
అదే సంవత్సరం అక్కినేని నాగేశ్వర రావు కథానాయకుడుగా కె .ప్రత్యగాత్మ దర్శకత్వం వహించి 'కుల గోత్రాలు ' సినిమాలో కూడా
చిన్న పాత్రలో నటించారు . 1963లో ఎన్ .టి .ఆర్ .కథానాయకుడుగా మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన 'పరువు - ప్రతిష్ఠ ' చిత్రంలో కూడా కృష్ణకు చిన్న పాత్రే లభించింది . ఆ తరువాత కొంతకాలం వేచి వున్నారు . 1965లో ఆదుర్తి సుబ్బారావు 'తేనే మనసులు ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కృష్ణకు కథానాయకుడుగా అవకాశం కల్పించారు . అయితే అప్పుడు సినిమా పంపిణీదారులు కొత్త హీరో వద్దు , పాత వారిని పెట్టమని ఆదుర్తి మీద వత్తిడి తెచ్చారు . నా నిర్ణయానికి తిరుగులేదని వారికి చెప్పాడు . ఆ సినిమా విజయవంతమైంది .
కృష్ణ జీవితం ఊహించని మలుపు తిరిగింది .
ఎన్నో చిత్రాల్లో నటించారు , నిర్మాతగా ,స్టూడియో అధినేతగా , దర్శకుడుగా , రాజకీయ నాయకుడుగా బహుముఖాలుగా ఎదిగారు .
50 సంవత్సరాల నట జీవితంలో 350 చిత్రాల్లో నటించారు .
కృష్ణ భోళా శంకరుడు . ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు . మనసులో ఏది పెట్టుకునేవారు కాదు .
పద్మాలయ స్టూడియోస్ ఎప్పుడు ఆయన నిర్మాతలు , శ్రేయోభిలాషులతో కలకాలాడుతూ ఉండేది .
సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత స్టూడియోస్ కు వచ్చేవారు . ఆయనకు స్టూడియోస్ లో ఓ ప్రత్యేకమైన విశాలమైన గది ఉండేది .
అక్కడ కూర్చునేవారు . సాయంత్రమైతే ఆ గదికి చాలామంది వచ్చేవారు . అన్ని విషయాలు చర్చకు వచ్చేవి .
అప్పుడే నేను కూడా ఆ సమావేశాలకు వెడుతూ ఉండేవాడిని . సినిమాకు సంబంధించిన అనేక విషయాలు తెలుస్తూ ఉండేవి . కొత్త సినిమాలు ప్రారంభం , విడుదల , ఏ సినిమా బాగా ఆడుతుంది , ఏది పర్యాయం పాలయ్యింది . ఎలాటి సంకోచం లేకుండా మాట్లాడేవారు .
ఇక సమావేశానికి వచ్చిన వారందరికీ వేడి వేడి మిరపకాయ బజ్జీలు లేదా ఉల్లిపాయ పకోడీ , జీడీ పప్పు ఉప్మా , ఫిల్టర్ కాఫీ ని వారి సోదరుడు హనుమంతరావు పంపించేవారు .
కృష్ణ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనకు అనధికార మీడియా సలహాదారుగా ఉండేవాడిని .
తెలుగు సినిమాలో కృష్ణ గారు ఓ ప్రభంజనం . ఓ సంచలనం .
సూపర్ స్టార్ , నట శేఖర బిరుదులతో పాటు 2003లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ .టి .ఆర్ . జాతీయ అవార్డును ప్రదానం చేసింది .
2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తో సత్కరించింది.
రాజీవ్ గాంధీ ఆహ్వానంతో కృష్ణ 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏలూరు నుంచి పార్లమెంట్ సభ్యుడుగా పోటీ చేసి విజయం సాధించారు .
సూపర్ స్టార్ , పద్మ భూషణ్ కృష్ణ 15 నవంబర్ 2022న తన 79వ సంవత్సరంలో మరణించారు .



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి