స్మృతి పథంలో రామోజీ రావు గారు 

తెలుగు నాటి నిత్యం వినిపించే పేరు రామోజీ రావు . రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ప్రారంభమై వ్యవస్థగా ఎదిగారు . 

1974లో ఈనాడు ప్రారంభించి, తెలుగు పత్రిక రంగాన్ని శాసించిన రామోజీ రావు గారు , 1984లో  ఉషాకిరణ్ మూవీస్ ప్రారంభించి తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేశారు .

1995లో ఈటీవీ తో తెలుగు వార్తా ప్రపంచంలో ఒక సంచలనం కలిగించారు . 

 1996లో తన పేరుతో ఏర్పాటు చేసిన ఫిలింసిటీ ఒక అద్భుతం . దేశానికే గర్వకారణం . 2005లో ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో గా రామోజీ ఫిలింసిటీ  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది . 


1984లో రామోజీ రావు గారిని మా జ్యోతి చిత్ర (ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక ) కోసం ఇంటర్వ్యూ చేశాను .

అప్పుడు నందమూరి  తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నారు . ఆ ఇంటర్వ్యూ లో తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచు హైద్రాబాద్ కు తరలి రావాలంటే ప్రభుత్వం ఏమి చెయ్యాలి .. అనేది ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది . 

అప్పటి నుంచి వారు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవారు .  1987లో జరిగిన మా వివాహానికి ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరి రామారావు గారు , మయూరి జనరల్ మేనేజర్ త్రిపురనేని కేశవ రావు గారితో కలసి వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు .

మా పెద్ద పాప శైలి పుట్టినప్పుడు ఆశీర్వదిస్తూ లెటర్ వ్రాశారు . 

జ్యోతి చిత్ర కోసం మరొకసారి కూడా ఇంటర్వ్యూ చేశాను . 1999లో ఆంధ్ర ప్రభలో వున్నప్పుడు ఫిలిం సిటీ గురించి 

ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు . 

మీరు చూస్తున్న ఫోటో 1984లో ఇంటర్వ్యూ చేసినప్పటిది .

రామాజీ రావు గారు ఎప్పుడు స్మరణీయులే . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు