స్టాలిన్ తో రజనీకాంత్ సమావేశం అందుకేనా ?
తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు .
విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ కలసి తనకు కాంగ్రెస్ పార్టీ తో 112 మంది మద్దతు ఉందని , ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేశాడు . అయితే ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి 118 మంది శాసన సభ్యులు అవసరమని గవర్నర్ స్పష్టం చేశాడు .
గురువారం చెన్నై లోని నెహ్రు స్టేడియం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో గవర్నర్
ఎలా చెప్ప్పడం విజయ్ కు మింగుడుపడలేదు .
ఎన్నికల్లో నెగ్గిన పార్టీల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని ఆహ్వానించడం ఆనవాయితీ . అదే పద్దతిని గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ అనుసరిస్తాడని విజయ్ నమ్మాడు .
విజయ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని అధికారికంగా ప్రకటించడం , లేఖ ఇవ్వడం తో గవర్నర్ మాట మార్చి వుండవచ్చున్నాని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు . సుబ్రహ్మణ్య స్వామి లాటి రాజ్యాంగ నిపుణులు కూడా గవర్నర్ చర్య ను తప్పుపడుతున్నారు.
ఇదిలా ఉండగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది .
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్ .కరుణానిధి తో రజనీకాంత్ కు ఆత్మీయమైన అనుబంధం వుంది.
కరుణానిధి మొదట సినిమా రచయిత , తరువాత రాజకీయాలకు ప్రభావితం అయ్యాడు . ద్రవిడ సిద్ధాంతాన్ని అనుసరించి అన్నాదురై 1949 సెప్టెంబర్ 17న ద్రవిడ మున్నేట్ర కజగం ప్రాంతీయ పార్టీని ప్రారంభించాడు . ఆ పార్టీ నేత అన్నాదురై భావాలు బాగా నచ్చిన కరుణానిధి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాడు . 1967లో అన్నాదురై మంత్రివర్గంలో కరుణానిధి మొదటిసారి మంత్రి పదవి నిర్వహించాడు . 1969లో అన్నాదురై మరణించిన తరువాత డి .ఎమ్ .కె .పార్టీ కి అధ్యక్షుడయ్యారు .
కరుణానిధితో రజనీకాంత్ కు నాలుగు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు వున్నాయి. కరుణానిధి తరువాత ఆయన వారసుడుగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ తో కూడా ఆయనకు అనుబంధం వుంది .
1872లో కరుణానిధితో విభేదించి ఎమ్ .జి .రామ చంద్రన్ అన్నా డి .డి .ఎం.కె .పార్టీని ప్రారంభించాడు . అప్పటి నుంచి తమిళనాడులో ఈ ర్నేడు పార్టీలే అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి .
విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించడమే కాక ఏడు దశాబ్దాలుగా తమిళనాడులో ద్రవిడ ప్రాబల్యం వున్న డి . ఎమ్ .కె , అన్న డి .ఎమ్ .కె పార్టీలను విజయ్ చిత్తుగా ఓడించడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు .
అందుకే రజనీకాంత్ స్టాలిన్ ను కలసి అన్నా డి .ఎమ్ .కె తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని సూచించినట్టు తెలుస్తుంది .
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు , అవకాశాన్నిబట్టి , అవసరానికి మిత్రులుగా మారవచ్చు . పైగా ఈ రేంద్రు పార్టీలు ద్రవిడ
సంస్కృతీ గురించి ఏర్పాటైనవే . అందుకే ఈ రెండు పార్టీలు కలవడంవల్ల తమిళనాడులో ద్రవిడ కల్చరల్ కొనసాగే అవకాశం ఉందని రజనీ చెప్పి వుండవచ్చునని తెలుస్తుంది .
ఇప్పుడు ఈ రెండు పార్టీలతో పాటు పి .ఎమ్ .కె ,ఐ .యు .ఎమ్ .ఎల్ , సి .పి .ఐ , సి .పి .ఎమ్ ,వి .సి .కె ,ఏ .ఎమ్ .ఎమ్ .కె ,డి .ఎమ్ .డి .కె పార్టీలన్నీ కలిస్తే 120 మంది శాసన సభ్యులవుతున్నారు . ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యవచ్చునని వీరు ఒక అంచనాకు వచ్చారు .
ఎప్పుడైతే అన్నా డి .ఎమ్ .కె తో డి .ఎమ్ .కె కలుస్తుందని వాతలు వచ్చాయో ఒక్క కాంగ్రెస్ తప్ప మిగాతా పార్టీలన్నీ విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించాయి . ఇది ఆసక్తికరమైన పరిణామం .
గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి