రామానాయుడు గారు @ 90

ఈరోజు పద్మభూషణ్ , మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే డి .రామానాయుడు గారి 90వ జయంతి 

రామానాయుడు గారు మనకు దూరమై అప్పుడే 11 సంవత్సరాలు అవుతుంది .

అయినా వారి జ్ఞాపకాలు మన మనస్సులో పదిలంగానే ఉన్నాయి .


భారతీయ సినిమా చరిత్రలో రామానాయుడు గారిది ఓ సువర్ణ అధ్యాయం . 

భారతీయ భాషల్లో అనేక  చిత్రాలను నిర్మించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక నిర్మాత రామానాయుడు గారు . నిర్మాతగా , స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ , డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌  సంస్థల అథినేతగా ఆయన బహుముఖాలుగా ఎదిగారు . 

రామానాయుడు గారు బాపట్ల పార్లమెంట్ సభ్యుడుగా తమ మాతృ భూమి ఋణం తీర్చుకోవడానికి కోట్ల రూపాయల స్వంత డబ్బు 

ఖర్చు చేసిన మానవతావాది .


రామానాయుడు గారితో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి .

నాయుడు గారు  నాకు ప్రాతః స్మరణీయులు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు